దేశంలో రోజు రోజుకూ హత్యలు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది క్రూరమృగాల చేతిలో బలవుతున్నారు. కారణం ఏదైనా చంపడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటున్నారు కొందరు. ఎలా లేదన్నా రోజుకు దేశ వ్యాప్తంగా పదికి పైగా హత్యలు నమోదు అవుతున్నాయి. దీని బట్టి చూస్తే దేశంలో హత్యలు చేసే నేరగాళ్లు ఏ రేంజ్‌లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరో హత్య జరిగింది. కన్న కొడుకు చూస్తుండగానే ఓ మహిళను అతి దారుణంగా హత్య చేశారు.
ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
కొడుకు ముందే తల్లి దారుణ హత్య
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన ఈ హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. బీజాపుర్ జిల్లాకి చెందిన అంగన్వాడీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా చంపారు. CRPF క్యాంపు సమీపంలో ఈ దారుణం జరిగింది. అంగన్వాడీ కార్యకర్త అయిన లక్ష్మీని కొందరు వ్యక్తులు ఇంటి నుంచి బయటకు లాక్కెల్లి హత్య చేయడంతో అంతా షాక్ అయ్యారు.
ఇది కూడా చూడండి: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
ఆమెను తీసుకెళ్తున్న సమయంలో తన తల్లిని రక్షించేందుకు వచ్చిన కుమారుడిని దారుణంగా కొట్టారు. అనంతరం అతడి ఎదుటే లక్ష్మిని దారుణంగా హత్య చేశారు. కాగా ఆమెకు గతంలో నక్సలైట్ల నుంచి కొన్ని బెదిరింపులు సైతం వచ్చినట్లు సమాచారం. వారే ఈ హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం.. ఆమె పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తుండటమే అని తెలిసింది. ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటిదే మరో హత్య
ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం
కడపజిల్లా వేముల మండలం కొత్తపల్లిలో షర్మిల అనే అమ్మాయిని కులయప్ప అనే యువకుడు ప్రేమించాడు. అయితే షర్మిల ఆ అబ్బాయిని ప్రేమించలేదు. దీంతో కులయప్ప రెచ్చిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల పై కులయప్ప కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో వారిని చూసి కులయప్ప పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం చుట్టుపక్కల వారు, బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అపస్మారక స్థితిలో యువతి..
ఇది కూడా చూడండి: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!
షర్మిల శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. షర్మిల అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పులివెందుల నుంచి కడప రిమ్స్ కు తరలించారు. షర్మిల తండ్రి వీఆర్ఏగా పనిచేస్తూ రెవెన్యూ గ్రామసభలు కోసం గొందిపల్లెకు వెళ్లారు. తల్లి కూలి పనికి వెళ్లడంతో దాడి సమయంలో ఇంట్లో షర్మిల ఒక్కతే ఉంది. ఇదే అదునుగా భావించిన ఉన్మాది.. ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం షర్మిల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కత్తిపోట్లు ఎక్కువ ఉండడం, బాగా రక్తం పోవడంతో పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.