/rtv/media/media_files/2025/11/14/amit-shah-2025-11-14-10-51-32.jpg)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 174 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు కొనసాగుతోన్నారు. 66 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రచారంలో భాగంగా హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ నిజం అయ్యాయి. ఎన్డీఏ 160 సీట్లు గెలుచుకుంటుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమిత్ షాచెప్పినట్లుగానే ఫలితాలు అదే దిశలో కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో, మొదటి రౌండ్‌ల నుండే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ఫలితం ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహాన్ని నింపగా, అమిత్ షా వ్యూహాలకు దక్కిన విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ (MGB) కూటమి ఈ ఎన్నికల్లో గణనీయమైన ఎదురుదెబ్బ తగిలింది. తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ (RJD) చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు సాధించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బలహీనమైన ప్రదర్శన కూటమి ఓటమికి ప్రధాన కారణమైంది. ఆర్జేడీ సింగిల్-లార్జెస్ట్ పార్టీ హోదాను కోల్పోనుంది. 2020 లో ఆ పార్టీ 75 సీట్లు గెలుచుకుంది, బీజేపీ కంటే ఒకటి ఎక్కువ.
బిహార్ ఎన్నికలు.. పార్టీల వారీగా ఆధిక్యాలు ఇలా..
జేడీయూ - 79
బీజేపీ - 74
ఎప్‌జేపీ (ఆర్‌వీ) - 17
ఆర్జేడీ - 47
కాంగ్రెస్ - 11
Follow Us