కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక రసవత్తరంగా మారనుంది. ప్రియాంక గాంధీపై ఓ నటిని పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌తోపాటు, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీచేసి రెండు చోట్ల గెలిచారు. దాంతో వాయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇలా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!
ప్రియాంకా గాంధీకి పోటీగా నటి ఖుష్బూ
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని ఆ పార్టీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ తరుణంలో ప్రియాంకా గాంధీపై నటి ఖుష్బూ సుందర్‌ను బీజేపీ తరపున బరిలోకి దించాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు.. ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు
బీజేపీ ఆచితూచి అడుగులు
ఈ విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉండటం.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు దక్కించుకోవడంతో బీజేపీ సందిగ్దంలో పడింది. అదీకాకుండా కాంగ్రెస్ తరపును ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో.. ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.
ఇది కూడా చూడండి: Rotten Chicken: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!
వాయనాడ్ ఉపఎన్నికలో త్రిముఖ పోటీ
అందువల్లనే కీలకంగా చర్చించి సీనియర్ నాయకురాలు, నటి ఖుష్బు అయితే గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. ఎన్నికలవేళ ఇలాంటి ప్రచారాలు కామన్ అని అన్నారు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ప్రియాంకపై పోటీకి తాను సిద్ధమని తెలిపారు. దీంతో వాయనాడ్ ఉపఎన్నికలో త్రిముఖ పోటీ ఉండనుంది.
ఇది కూడా చూడండి: సల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్
కమ్యూనిస్టు పార్టీ నుంచి బలమైన అభ్యర్థి
ఎందుకంటే కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలో దింపింది. ఆపార్టీ నుంచి సత్యన్ మొఖేరీ బరిలో దిగుతున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోపాటే లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు.
ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్