IFFI 2025: 50 ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ... రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం

చలన చిత్ర రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి -2025) వేడుకల్లో వీరిద్దరినీ ఘనంగా సత్కరిస్తారు.

New Update
FotoJet - 2025-11-17T102533.810

50 years in the industry

 IFFI 2025 : చలన చిత్ర రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి - 2025) వేడుకల్లో వీరిద్దరినీ సౌగౌరవంగా సత్కరించనున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకల్లో ఈ దిగ్గజ నటులను సన్మానించనున్నారు. కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ 56th International Film Festival of India Event గురించి వివరించారు.

‘‘చలన చిత్ర ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌, బాలకృష్ణలను  సన్మానించనున్నాం. ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక గొప్ప మైలురాయి. వారి అద్భుతమైన నటన, గొప్ప ప్రజాదరణతో దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలను వారు ప్రేక్షకులకు అందించారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని ఘనంగా సన్మానించనున్నాం’’ అని ఎల్‌.మురుగన్‌ తెలిపారు. సినీ రంగం ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఇఫి) అవార్డుల వేడుక నవంబర్‌ 20 నుంచి 28 వరకూ గోవా వేదికగా జరగనుండటం విశేషం.

 1975లో ‘అపూర్వ రాగంగళ్‌’తో సినీ రజనీకాంత్‌ సినిమా రంగప్రవేశం చేశారు. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి తన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బాలకృష్ణ బాల నటుడిగా తెరగ్రేట్రం చేసి ఒకవైపు నటుడిగా అలరిస్తూనే మరోవైపు రాజకీయ, సామాజిక సేవలో రాణిస్తున్నారు. ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘అఖండ 2’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisment
తాజా కథనాలు