జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్‌కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. అయితే బ్రెల్ గ్రామం వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Also Read: కార్పొరేట్ హత్యలు.. పని చేస్తున్నామా..చావుకు దారులు వేసుకుంటున్నామా?
దీంతో సమాచారం తెలుసుకున్న అక్కడి స్థానికులు, సాయుధ బలగాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ విషాద ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలో కోల్పోగా.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న మొదటిదశ పూర్తి కాగా.. రెండో దశ 25న జరగనుంది.