టెన్త్ పరీక్ష పేపర్ లీక్.. 25 మంది పోలీసులు సస్పెండ్

హర్యానా ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది.  టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో నలుగురు డీఎస్పీల సహా 25 మంది పోలీసుల సస్పెండ్ చేసింది.  అంతేకాకుండా ఐదుగురు ఇన్విజిలేటర్లను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

New Update
Haryana Paper Leak Case

హర్యానా ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది.  టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో నలుగురు డీఎస్పీల సహా 25 మంది పోలీసుల సస్పెండ్ చేసింది.  అంతేకాకుండా ఐదుగురు ఇన్విజిలేటర్లను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  ఈ  లీక్ కేసును ముఖ్యమంత్రి నయీబ్ సింగ్ సైనీ తీవ్రంగా పరిగణించారు. ప్రాథమిక దర్యాప్తులో 25 మంది పోలీసు అధికారులు దోషులుగా తేలిందని సీఎం అన్నారు. 

Also read :  మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..ఆ రోజున 14 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్‌

ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారంటే 

5 గురు ఇన్స్పెక్టర్లపై (4 ప్రభుత్వ, ఒక ప్రైవేట్) ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మొత్తం 4 ప్రభుత్వ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.
2 కేంద్ర పర్యవేక్షకులను కూడా సస్పెండ్ చేశారు.
నలుగురు బయటి వ్యక్తులు, 8 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో దోషులుగా తేలిన 25 మంది పోలీసు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
4 మంది డీఎస్పీలు, 3 ఎస్‌హెచ్‌ఓలు, 1 అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ సహా మొత్తం 25 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.

గురువారం హర్యానాలో 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయిన తర్వాత, శుక్రవారం 10వ తరగతి గణితం పేపర్ లీక్ కేసు వెలుగులోకి వచ్చింది. 

Also Read :   Bandi Sanjay: అంతా మీ ఇష్టమేనా.. 10వ తరగతి పరీక్షలపై బండి సంజయ్ ఫైర్

Advertisment
తాజా కథనాలు