ఆమెకు 17 ఏళ్లు, అతడికి 22 ఏళ్లు. ఇద్దరూ వేరు వేరు ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఓ రోజు ఆ యువకుడు ఆ మైనర్ బాలికను తీసుకుని హోటల్ కు వెళ్లాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. సరిగ్గా ఒక నెల తర్వాత తనను కలవడానికి ఆ మైనర్ బాలికను పిలిచాడు. అక్కడ ఓ విషయంలో ఇద్దరికి గొడవ మొదలైంది. అది కాస్త తీవ్రంగా మారడంతో ఆ యువకుడు ఆమెను గాయపరిచాడు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం బయటపడింది. ఈ విచారణలో ఆ యువకుడు ఎవరో తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్!
హూటల్‌లో అత్యాచారం
రాజస్థాన్‌లోని (Rajastan) జైపూర్‌కి చెందిన 17 ఏళ్ల బాలిక అదే పట్టణంలో ఉంటూ నీట్‌కు ప్రిపేర్ అవుతుంది. అలాగే 22 ఏళ్ల కునాల్ అనే యువకుడు జోధ్‌పూర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆగస్టు 25న ఆ యువకుడు మైనర్ బాలికను హూటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు పెంట మొదలైంది. సరిగ్గా ఒక నెల తర్వాత సెప్టెంబర్ 27న ఆ యువకుడు న్యూ అతీష్ మార్కెట్ మెట్రో స్టేషన్‌కు రమ్మని ఆ బాలికను పిలిచాడు.
ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!
ఆమె అక్కడకి వచ్చింది. అక్కడే వారిద్దరి మధ్య మతాల యుద్ధం మొదలైంది. అది కాస్త తీవ్రంగా మారడంతో ఆ బాలికను మెట్రో ప్లాట్ ఫార్మ్ పై నుండి కిందకి తోసేశాడు. దీంతో ఆ బాలికకు తీవ్రంగా గాయమైంది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుపూస కూడా చాలా డ్యామేజ్ అయింది. దీంతో ఆమెను సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలియగానే ఆ బాలిక తండ్రి పోలీష్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Cricket Lovers కు బ్యాడ్ న్యూస్.. తొలి టెస్ట్‌కు వర్షం ముప్పు
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్ 27 నాటి మెట్రో సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆ యువకుడిపై అత్యాచారం, హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ అడ్మిషన్ వివాదం .. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రస్తుతం ఆ యువకుడిని విచారిస్తున్నారు పోలీసులు.. అందిన సమాచారం ప్రకారం.. ఆ యువకుడు ఆమెకు బాగా తెలిసిన వ్యక్తి అని తెలిసింది. దాదాపు ఐదేళ్లుగా ఒకరికొకరు పరిచయం అని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.