ఈ మధ్య కాలంలో కామాంధులు చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కనిపించిన వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే కోల్‌కతా వైద్యురాలి దారుణమైన హత్యాచార ఘటన యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ ఘటన మరువక ముందే బెంగాల్‌లో మరో ఘోరం జరిగింది.
10 ఏళ్ల బాలిక మృతి
కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన 10 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లా మహిషామారి గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక శుక్రవారం కోచింగ్ క్లాస్‌కు వెళ్లింది. అయితే రాత్రి అయినా ఆ బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి : బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలించారు. దీంతో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఓ పొలంలో అనుమానాస్పద స్థితిలో ఆ బాలిక కనిపించింది. ఒంటినిండా గాయాలతో కనిపించడంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ఈ ఘటనపై అనుమానం ఉన్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌పై కర్రలతో దాడి చేసారు. అవుట్ పోస్టుకు నిప్పు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారని.. వెంటనే స్పందించి ఉంటే బాలిక ప్రాణాలతో దక్కేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం
ఈ దారుణమైన ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ స్పందించారు. బెంగాల్ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.