యువజన వ్యవహారాలు అండ్ క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2023ని ప్రకటించింది. అవార్డు గ్రహీతలు జనవరి 9, 2024 (మంగళవారం) ఉదయం 11:00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావాలి. భారత రాష్ట్రపతి నుంచి వారి అవార్డులను అందుకుంటారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలకు అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు చిరాగ్ శెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్నారు. సాత్విక్‌సాయిరాజ్ పుట్టింది అమలాపురంలోనే కావడం విశేషం.
ఇక నేషనల్ స్పోర్ట్స్ ఎవరెవరికీ వచ్చాయో ఓ లుక్కేయండి:
అర్జున అవార్డు:
మహ్మద్ షమీ (క్రికెట్)
అజయ్ రెడ్డి (అంధుల క్రికెట్)
ఓజాస్ ప్రవీణ్ డియోటాలే (ఆర్చరీ)
అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ)
శీతల్ దేవి (పారా ఆర్చరీ)
పరుల్ చౌదరి, మురళీ శ్రీశంకర్ (అథ్లెటిక్స్)
మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్)
ఆర్ వైశాలి (చెస్)
దివ్యకృతి సింగ్, అనుష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్)
దీక్షా దాగర్ (గోల్ఫ్)
క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ)
సుశీల చాను (హాకీ)
పింకీ (లాన్ బాల్)
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)
యాంటీమ్ పంఘల్ (రెజ్లింగ్)
ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
ఈషా సింగ్ (షూటింగ్)
హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్)
సునీల్ కుమార్ (రెజ్లింగ్)
నౌరెమ్ రోషిబినా దేవి (వుషు)
ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్)
పవన్ కుమార్ (కబడ్డీ)
రీతూ నేగి (కబడ్డీ)
నస్రీన్ (ఖో ఖో)
అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు 2023:
గణేష్ ప్రభాకరన్ (మల్లాఖాంబ్)
మహావీర్ సైనీ (పారా అథ్లెటిక్స్)
లలిత్ కుమార్ (రెజ్లింగ్)
RB రమేష్ (చెస్)
శివేంద్ర సింగ్ (హాకీ)
ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అవార్డు:
కవిత (కబడ్డీ)
మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్)
వినీత్ కుమార్ శర్మ (హాకీ)
Also Read: టీమిండియా పేసర్ షమీకి అర్జున అవార్డు.. ప్రకటించిన కేంద్రం!
WATCH: