NASA Space Station: హమ్మయ్య ఎట్టకేలకు దొరికేసింది.. 8 నెలల గాలింపునకు ముగింపు పలికింది.. స్పేస్ సెంటర్లో వ్యోమగాముల శ్రమకు ఫలితం దక్కింది.. ఎంతో విలువైనది ఒక్కసారిగా మిస్ అవడంతో అంతా షాక్కు గురయ్యారు. చివరకు 8 నెలల తరువాత మళ్లీ దొరకడం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకీ ఏం పోయింది.. ఏం దొరికిందినేగా మీ కంగారు.. టెన్షన్ పడకండి. టమాటా పోయింది.. మళ్లీ 8 నెలల తరువాత దొరికింది. అవును.. టమాటానే.. అయితే, ఇక్కడ పోలేదు. అంతరిక్షంలో పొయింది. అందుకే అంత స్పెషల్గా నిలిచింది ఆ టమాటా. గత మార్చి నెలలో భూమికి వెలుపల అంతరిక్షంలో పంట పడించారు నాసా ఆస్ట్రోనాట్స్. ఆ పంటలో భాగంగా టమాటాను పండించారు. అయితే, స్పేస్ సెంటర్లో ఉన్న వ్యోమగామి ఫ్రాంక్ రూబియో తన వాటాగా పొందిన ఈ టమాటాను పోగొట్టాడు. దాంతో మిగతా సహచరులలో ఎవరో ఒకరు తన టమాటాను తిని ఉంటారని భావించాడు. కానీ, చివరకు అది దొరకడంతో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Space Station: అంతరిక్ష కేంద్రంలో టమాటా మాయం.. 8 నెలల తరువాత ప్రత్యక్షం..!
అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం పోయిన టమాటా మళ్లీ దొరికొంది. స్పేస్ సెంటర్లో పండించిన ఈ టమాటా గత మార్చి నెలలో మిస్ అవగా.. తాజాగా దొరికినట్లు ప్రకటించారు.
Translate this News: