అంగారకుడిపై సూర్యోదయం.. వండర్ వ్యూ.. మీరూ ఓ.. లుక్కెయ్యండి!

New Update

కొన్ని అన్ని అనుభూతులను ఖచ్చితంగా డైరెక్ట్‌గా చూసి మురిసిపోవాల్సిందే. అందులో ఇదొక్కటి.. ఉదయించే సూర్యుడిని చూడడం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది.. ప్రశాంతమైన వాతావరణంలో సూర్యోదయాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఎక్కడెక్కడికో వెళుతుంటారు. ఇక సముద్రపు ఒడ్డున సూర్యోదయం చూడడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి, అంగారక గ్రహంపై సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాసా విడుదల చేసిన ఈ ఫొటోలు తప్పకుండా మీరందరు చూడాల్సిందే. అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్ ఈ అద్భుతమైన ఫొటోలను తీసి పంపించింది. సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాన్ని కలిపి (పనోరమిక్ వ్యూ) ఫొటోలు తీసింది.

nasa-shares-panoramic-postcard-capturing-morning-and-afternoon-views-from-mars

స్థానిక అంగారక కాలమాన ప్రకారం... ఏప్రిల్ 8న ఉదయం 9:20 గంటలకు సూర్యోదయాన్ని, మధ్యాహ్నం 3:40 గంటలకు సూర్యాస్తమయాన్ని కలిపి క్యూరియాసిటీ రోవర్ ఈ ఫొటోలు తీసింది. ఈ ఫొటో తీసే సమయానికి గేల్ క్రేటర్ అనే పర్వతంపై రోవర్ ప్రయాణిస్తోందని, రోవర్‌కు అమర్చిన నేవిగేషన్ కెమెరాలతో ఈ అద్భుత ఫొటోలను తీసిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అంగారకుడి ఉపరితలంపై నుంచి ఈ పర్వతం సుమారు 5 కిలోమీటర్ల ఎత్తును కలిగి ఉంటుందట. ఆ కొండపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కూడా వావ్ సూపర్, అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు