Time On Moon : ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ జోన్ ఉంటుంది. నిమిషాల నుంచి 12 గంటల వరకు సమయాల్లో తేడాలున్నాయి. ఈ కాలాలు, వాటిలో తేడాలను మన పూర్వీకులు ఎప్పుడో నిర్ణయించేశారు. సూర్యగమనాన్ని బట్టి సమయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే తరహాలో చంద్రుని మీద టైమ్‌ను కూడా నిర్ణయించనున్నారు. భూమి మీద ఉంటూనే జాబిల్లి మీద టైమ్‌ను చెప్పవచ్చును. చంద్రుడి(Moon) తో పాటు ఇతర గ్రహాల మీద సమయం ఎంతో తెలుసుకునేలా లూనార్ స్టాండర్ట్ టైమ్ ను ఫిక్స్ చేయాలని ఆదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాను ఆదేశించింది.
2026నాటికి చంద్రుని టైమ్ జోన్..
2026 డిసెంబ్ ఎండ్ లోపున చంద్రున మీద టైమ్‌ను నిర్ణయించాలని వైట్ హౌస్ నాసా(NASA) కు ఆదేశాలిచ్చింది. దానికి కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ LTC అని పేరు పెట్టింది. నాసా తో పాటు మరో నాలుగు సంస్థలకు కలిపి ఈ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ప్రపంచం అంతా చంద్రుని మీద విస్తృత ప్రయోగాలు చేస్తోంది. ఇవి భవిష్యత్తులో మరింత ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాదు చంద్రుని మీద నివాసానికి కూడా పరిశోధనలు జరగుతున్నాయి. అయితే భూమి మీద తయారు చేసిన గడియారాలు చంద్రుడి మీద రోజులో 58.7 మైక్రోసెకండ్స్ కోల్పోయి చూపిస్తున్నాయి. పరిశోధనల్లో ప్రతీ సెకండ్ ఇంపార్టెంటే. నేవిగేషన్‌లో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండాలంటే.. చంద్రుని మీద స్టాండర్డ్ టైమ్ ఉండాలి. దానికోసమే లూనార్ టైమ్ జోన్ సెట్ చేయాలని వైట్ హౌస్ ప్రతిపాదించింది.
అంతరిక్షంలోని ఆయా స్థానాల్లో సమయం ఒక్కోలా ఉంటుంది. అందుకే, అంతరిక్షంలో ఆపరేటర్ల మధ్య సమయం విషయంలో కచ్చితత్వం అవసరం. చంద్రుడి మీద ప్రామాణిక సమయాన్ని రూపొందించడం నావిగేషన్, కమ్యూనికేషన్‌లకు చాలా కీలకం కానుంది అనివైట్ హౌస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ డిప్యూటీ డైరెక్టర్ స్టీవ్ వెల్బీ చెబుతున్నారు. చంద్రుని మీద టైమ్ సెట్ చేయడానికి నాసాతో పాటు ప్రైవేట్ కంపెనీలు, అంతరిక్ష సంస్థలు చంద్రుడు, అంగారక గ్రహం(Mars) తో పాటు పలు గ్రహాలపై పరిశోధనలు మొదలుపెట్టాయి. దీని కోసం వాణిజ్యం, రక్షణ, రవాణా శాఖలతో కలిసి పని చేయాలని వైట్ హౌస్ నాసా(White House NASA) ను ఆదేశించింది.
Also Read : Strange World : ఆ దేశంలో అన్ని జీవరాశులూ ఉంటాయి..ఒక్క చీమలు తప్ప