Narendra Modi Decision: పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్స్ లా చెప్పుకున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించి తిరుగులేదని నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ మూడు రాష్ట్రాల్లోనూ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చెప్పకుండానే ఎన్నికల సమరంలో దూకింది. ప్రధాని మోదీనే తమ ప్రధాన ప్రచార కేంద్రంగా చేసుకుని ఎన్నికల్లో ముందుకు సాగింది. అయితే, మూడు రాష్ట్రాల్లోనూ గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన నాయకులున్నారు. అంతకు మించి పార్టీని భుజాలపై మోసిన నేతలు ఉన్నారు. పైగా చాలామంది ఎంపీలను తీసుకువచ్చి ఈ రాష్ట్రాల అసెంబ్లీకి పోటీలో నిలబెట్టారు. వారిలో గెలిచిన బీజేపీ సీనియర్స్ ఉన్నారు. కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చిన దాదాపు పదిరోజుల వరకూ ముఖ్యమంత్రులను ప్రకటించడానికి ఆచి, తూచి వ్యవహరించింది బీజేపీ. చివరకు మూడు రాష్ట్రాలలోనూ ఎవరూ ఊహించని.. ఎవరి లెక్కల్లోనూ లేని నేతలను ముఖ్యమంత్రులుగా ప్రకటించి షాక్ ఇచ్చింది బీజేపీ. పేరుకే బీజేపీ కానీ, ఆ వ్యవహారాలకు మూల కేంద్రం మాత్రం ప్రధాని మోదీ అనేది అందరికీ తెలిసిందే. అసలు బీజేపీ అంటేనే మోదీ.. అన్నంతగా ఆయన ప్రభావం ఉంది. ఇప్పుడు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలో ఈ లెక్కలు వేశారు అనేది పక్కన పెడితే.. ఇటువంటి సంచలన నిర్ణయాలు.. ప్రత్యర్ధులు కానీ.. ప్రజలు కానీ.. స్వపార్టీ వ్యక్తులు కానీ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీ(Narendra Modi Decision) తీరే వేరు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాల దగ్గర నుంచి ప్రధానిగా తీసుకుంటున్న నిర్ణయాల వరకూ అన్నీ సంచలనమే. మరీ ముఖ్యంగా ప్రధానిగా ఆయన తీసుకున్న అకస్మాత్తు నిర్ణయాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ప్రజలను ఆశ్చర్యంలో ముంచడంలో మోదీ తరువాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు.
ప్రధాని మోదీ పాలనలో బిజెపి తన నిర్ణయంతో ఆశ్చర్యపడటం ముఖ్యమంత్రుల వ్యవహారంతో ఇదే మొదటిసారి కాదు, కానీ 2014 నుంచి, ముఖ్యమంత్రి పేరు నుంచి క్యాబినెట్ మంత్రి, గవర్నర్ -రాష్ట్రపతి వరకు ఆశ్చర్యకరమైన పేర్లు తెరమీదకు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నిర్ణయాల ద్వారా తరచుగా హెడ్‌లైన్స్‌లో ఉంటారు. అకస్మాత్తుగా పాకిస్థాన్ చేరుకుని అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలవడం లేదా ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్ణయమైనా సరే. నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ(Narendra Modi Decision) మనకు నిద్రలేని రాత్రులు అందిచడం దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడం వరకూ అన్నీ అకస్మాత్తుగా.. ఆశ్చర్యపడే విధంగా తీసుకుని అమలులోకి తీసుకువచ్చిన నిర్ణయాలే.
ముఖ్యమంత్రుల విషయంలో ప్రతిసారీ..
2014 తర్వాత మోడీ-షా ద్వయం తన నిర్ణయాలతో పదే పదే బీజేపీని ఆశ్చర్యపరుస్తూ వస్తున్నారు. ప్రధాని మోదీ(Narendra Modi Decision) ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీడియాకు తెలియజేయడం లేదు. 2017లో యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం చేయాలనే నిర్ణయమైనా లేదా ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రిని మార్చాలన్నా. 2014లో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్, జార్ఖండ్‌లో రఘుబర్ దాస్, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్‌లను ముఖ్యమంత్రులుగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మనోహర్ లాల్, ఫడ్నవీస్ 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా మారి సీఎంలు అయ్యారు.
Also Read: కొడుకు ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి..సాధారణ జీవితం..రాజస్థాన్ సీఎం భజన్ లాల్ ఆస్తులు ఇవే
15 ఏళ్ల తర్వాత 2017లో జరిగిన యూపీ అసెంబ్లీలో బీజేపీ(Narendra Modi Decision) విజయం సాధించింది. ఈ ఎన్నికలలో కూడా PM మోదీ ఇమేజ్ తోనే పోరాడారు. BJP కూటమి 312 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత మనోజ్ సిన్హా నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య వరకు పేర్లు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చర్చలోకి వచ్చాయి. అయితే, మోడీ-షాలు యోగి ఆదిత్యనాథ్‌కు అధికారాన్ని అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీని తర్వాత ఆనందీబెన్ పటేల్‌ను తొలగించి విజయ్ రూపానీని సీఎం చేసి గుజరాత్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీని తర్వాత, విజయ్ రూపానీని తొలగించినప్పుడు, నితిన్ పటేల్‌ను సీఎం చేయాలనే చర్చ జరిగింది, అయితే ప్రధాని మోదీ భూపేంద్ర పటేల్‌ను సీఎం కుర్చీలో కూచోపెట్టి తన రూటే సపరేటు అని అనిపించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో జైరాం ఠాకూర్‌ను సీఎం చేసి ఆశ్చర్యానికి గురిచేస్తే, ఉత్తరాఖండ్‌లో మాత్రం సీఎంను మార్చే రాజకీయ ప్రయోగం చేసి ప్రతిసారీ షాక్ ఇస్తూ వచ్చారు. పుష్కర్ సింగ్ ధామి పేరు గురించి ఎవరికీ ఎలాంటి క్లూ లేదు. అనిల్ బలూని నుంచి సత్పాల్ మహారాజ్ వరకు ప్రజలు చాలా మంది గురించి చర్చించుకున్నారు. కానీ, అకస్మాత్తుగా, పుష్కర్ సింగ్ ధామిని తీసుకువచ్చారు. ఇది కాకుండా 2017లో యుపిలో దినేష్ శర్మను, 2022లో బ్రిజేష్ పాఠక్‌ను డిప్యూటీ సిఎంగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2020లో బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీజేపీ కోటా నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించారు. సుశీల్ మోదీని రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీకి రప్పించి ఆయన స్థానంలో రేణుదేవి, తార్కిషోర్ ప్రసాద్‌లను డిప్యూటీ సీఎంలుగా నియమించి ఊహాగానాలకు తెరదించారు.
కేంద్ర కేబినెట్ నుంచి అనుభవజ్ఞులు అవుట్..
మోదీ ప్రభుత్వం తన మొదటి మంత్రివర్గంలో ఏ నాయకులను చేర్చుకుంటుంది.. ఎవరిని పక్కన పెడుతుంది అనే విషయం ప్రధాని మోదీ(Narendra Modi Decision), అమిత్ షా మినహా ఎవరికీ తెలియదు. ఇది మాత్రమే కాదు, మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా, మోదీ ప్రభుత్వం తన మంత్రివర్గం నుంచి ఏ నాయకులను తొలగించి.. ఎవరిని చేర్చుకుంటారు అనే విషయంలో అసలు చిన్న లీక్ కూడా ఎప్పుడూ లేదు. ప్రకాష్ జావేద్కర్ నుంచి రవిశంకర్ ప్రసాద్ వరకు, కల్ రాజ్ మిశ్రా -రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీని గురించి ఎవరికీ తెలియదు, కానీ ప్రధాని మోదీ దానిని సాధించారు. ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో అశ్విని వైష్ణవ్, జైశంకర్‌లను చేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 2019లో రాజ్‌నాథ్‌సింగ్ నుంచి హోంశాఖను తీసుకుని అమిత్ షాకు అప్పగించినప్పుడు కూడా ఏమి జరుగుతుంది అనేది ఎవరికీ అర్ధం కాలేదు..
కాశ్మీర్ లో పీడీపీతో పొత్తు ఒక సంచలనం..
2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బీజేపీ(Narendra Modi Decision) తన సైద్ధాంతిక ప్రత్యర్థి పీడీపీతో పొత్తు పెట్టుకుని కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పొత్తు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఇది మాత్రమే కాదు Mohd. సయీద్ ముఫ్తీ మరణం తరువాత, మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కొన్ని రోజుల తర్వాత బిజెపి ఆ కూటమిని విచ్ఛిన్నం చేసింది. రాష్ట్రపతి పాలన తీసుకువచ్చింది. దీని తరువాత, 2019 లో, మోదీ ప్రభుత్వం జమ్మూ - కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేయడం ద్వారా దేశాన్ని ఒక్క కుదుపు కుదిపారు. ఈ విషయంలో ఆద్యంతం చాలా జాగ్రత్తగా.. ఎవరికీ అనుమానం రాకుండా.. పని కానిచ్చేశారు. దీనిని వ్యతిరేకించే వారు కూడా ఏమి జరుగుతుందో అర్ధం అయ్యేలోపు ఆర్టికల్ 370 రద్దు జరిగిపోయిని.
గవర్నర్ల దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా..
కేంద్రంలో ప్రధాని మోదీ(Narendra Modi Decision) అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ల నియామకంలో ప్రతిసారి ఆశ్చర్యకర నిర్ణయాలే వచ్చాయి. సీఎం యోగి ప్రత్యర్థిగా భావించిన శివ ప్రతాప్ శుక్లా.. చాలా కాలంగా పక్కకు జరపాలని చూశారు. అకస్మాత్తుగా ఆయనను కేంద్ర మంత్రి నుంచి గవర్నర్గా పంపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో అత్యంత విశ్వసనీయ మంత్రులలో థావర్‌చాద్ గెహ్లాట్ ఒకరిగా పరిగణిస్తారు. అయితే ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపారు. అదేవిధంగా కల్‌రాజ్ మిశ్రా నుంచి కళ్యాణ్ సింగ్ వరకు పేర్లు చాలా పేర్లు ఉన్నాయి.
Also Read: ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది
అదే సమయంలో, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి ఎన్నికలు రెండుసార్లు జరిగాయి. ఈ రెండు సార్లు PM మోదీ ఎవ్వరికీ కనీసం ఆలోచనలోకి కూడా రాణి విధంగా వ్యవహరించారు. రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ పేరును తొలిసారిగా ప్రకటించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాగే ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేసే సమయంలో కూడా జరిగింది. ఈ సమయంలో చాలా మంది నాయకుల పేర్లు చక్కర్లు కొట్టాయి. కానీ ప్రధాని మోదీ గిరిజన సంఘం నుంచి మొదటి మహిళా రాష్ట్రపతిని చేసి చరిత్ర సృష్టించారు. అంతెందుకు.. ఏపీ బీజేపీకి వెన్నెముకలా ఉండే వెంకయ్య నాయుడుని అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతిని చేసేశారు. రాజకీయ కారణాలే దీనివెనుక ఉన్నాయని అందరూ చెప్పుకున్నారు.
రాజకీయంగానే కాదు.. పాలనలోనూ షాక్ లే..
ప్రధాని హోదాలో కూడా మోదీ(Narendra Modi Decision) ఎన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 8, 2016న రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ 500, 1000 రూపాయల నోట్లను నిషేధించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆయన సీఎంగా ఉన్నపుడు వ్యతిరేకించిన జీఎస్టీ విధానం దేశంలో అమల్లోకి తీసుకువచ్చారు. 14 ఫిబ్రవరి 2019న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు CRPF కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకున్నారు. రెండు వారాల తర్వాత, 26 ఫిబ్రవరి 2019న, భారతదేశం బాలాకోట్ వైమానిక దాడులు నిర్వహించి జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చింది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడం మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటి. 2019 ఆగస్టు 5న దేశంలో ఎవరూ ఊహించని విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని చాలా క్లాజులను రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
2015లో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే అకస్మాత్తుగా పాకిస్థాన్ చేరుకున్న ప్రధాని మోదీ(Narendra Modi Decision) యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అది క్రిస్మస్ సందర్భంగా. ప్రధాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్నారు, ప్రధానికి పాకిస్తాన్ వెళ్ళే ఆలోచన ఉందని ఎవరికీ తెలియదు, కానీ కాబూల్ నుంచి తిరిగి వస్తుండగా, మోదీ అకస్మాత్తుగా లాహోర్ విమానాశ్రయంలో దిగారు. ఆ రోజు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన ఇంటికి కూడా వెళ్లి కాసేపు గడిపారు. ఈ పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తినప్పటికీ, ప్రధానమంత్రి తరపున, ఇది పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంగా చెప్పుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ తన చర్యలు, నిర్ణయాలతో ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.
మొత్తమ్మీద చూస్తే.. ప్రధాని మోదీ(Narendra Modi Decision) మదిలో ఏముందో చెప్పడం ఎవ్వరి తరం కాదనేది మాత్రం స్పష్టం అయింది. తీసుకునే ప్రతి నిర్ణయమూ.. వేసే ప్రతి అడుగూ ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తూనే వస్తున్నాయి. ఇక రాబోయే ఎన్నికల సమయంలో ఎటువంటి మేజిక్ లు చేసి మోదీ మేనియాని నిలబెట్టుకుంటారనేది వేచి చూడాల్సిందే.
Watch this interesting Video: