Bhajanlal Sharma: కొడుకు ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి..సాధారణ జీవితం..రాజస్థాన్ సీఎం భజన్ లాల్ ఆస్తులు ఇవే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అనూహ్యంగా ఎంపికైన భజన్ లాల్ శర్మ సామాన్య జీవితాన్ని గడిపే వ్యక్తి. వృత్తి వ్యాపారంగా అఫిడవిట్ లో చెప్పిన ఆయనకు కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయి. దాదాపుగా 50 లక్షల రూపాయల అప్పు ఉంది. దానిలో 19 లక్షలు ఆయన కొడుకు ఎడ్యుకేషన్ లోన్. By KVD Varma 13 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Education Loan : సీనియర్ నేత వసుంధర రాజే, కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ పేర్లు సీఎం రేసులో ఉన్నప్పటికీ విజయం భజన్లాల్కే దక్కింది. రాజస్థాన్(Rajasthan) లోని 200 స్థానాలకు గాను 199 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడ్డాయి. ఇందులో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీఎం రేసులో పలువురు పేర్లు వినిపించాయి. ఇందులో వసుంధర రాజే పేరు అగ్రస్థానంలో వినిపించింది. ఆమె కూడా తన బలాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ అధిష్టానం ముందు సీఎం రేసులో తానే మొదటి స్థానంలో ఉన్నానని నిరూపించుకోవడం కోసం విపరీత ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా బీజేపీ అధిష్టానం భజన్ లాల్ శర్మ(Bhajanlal Sharma)ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. భజన్ లాల్ శర్మ పార్టీలో పట్టున్న వ్యక్తి.. సంగనేర్ ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ(Bhajanlal Sharma)కు రాజస్థాన్ బీజేపీలో బలమైన పట్టు ఉంది. రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కూడా ఆయన సంస్థలో చురుగ్గా ఉన్నారు. 2023 ఎన్నికల్లో, మొదటిసారిగా, జైపూర్‌లోని సంగనేర్ వంటి సురక్షితమైన స్థానం నుంచి బిజెపి అతన్ని పోటీ చేయించింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన ఇప్పుడు శాసనసభా పక్ష సమావేశంలో సీఎం అయ్యారు. విశేషమేమిటంటే.. ఈ స్థానంలో భజన్‌లాల్ శర్మను పోటీ చేసేందుకు బీజేపీ అవుట్గోయింగ్ ఎమ్మెల్యే అశోక్ లాహోటీ టిక్కెట్టును కోత పెట్టింది. వృత్తి వ్యాపారం.. రాజస్థాన్‌లో సీఎం ముఖంగా ప్రకటించిన భజన్ లాల్ శర్మ(Bhajanlal Sharma) భరత్పూర్ నివాసి. 56 ఏళ్ల భజన్ లాల్ తండ్రి పేరు కిషన్ స్వరూప్ శర్మ. ADR నివేదికలో, అతని వృత్తి వ్యాపారంగా చూపించారు. అంతే కాకుండా తన భార్య ఆదాయాన్ని కూడా హోల్‌సేల్ వ్యాపారిగా చూపించారు. కోటి రూపాయల ఆస్థి.. 50 లక్షల అప్పు.. రాజస్థాన్‌లోని సంగనేర్ స్థానం నుంచి భజన్ లాల్ శర్మ(Bhajanlal Sharma) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు రూ.1.03 కోట్లు. అయితే కొడుకు చదువు కోసం తీసుకున్న రూ.16.53 లక్షల ఎడ్యుకేషన్ లోన ఇంకా బకాయి ఉంది. భజన్ లాల్ SBI నుంచి కూడా లోన్ తీసుకున్నారు. సామాన్యుడిలా తన అవసరాలను తీర్చేందుకు, భజన్ లాల్ శర్మ తన కుమారుడి చదువు కోసం PNB నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడమే కాకుండా, SBIలో తీసుకున్న రూ.29.46 లక్షల లాన్ బాకీ ఉంది. భజన్ లాల్ శర్మకు పిత్రార్జిత ఆస్తి లేదు, అంటే ఈయన దగ్గర ఉన్నదంతా ఆయన సంపాదించిందే. రూ.18 లక్షల విలువైన బంగారం.. భజన్ లాల్ శర్మ అఫిడవిట్ ప్రకారం, అతని భార్య వద్ద 30 తులాల బంగారం ఉంది, దీని విలువ సుమారు రూ. 18 లక్షలు. అతని వద్ద రూ.1.40 లక్షల విలువైన వెండి కూడా ఉంది. కాగా భజన్ లాల్ శర్మ పేరిట రూ.1.80 లక్షల విలువైన బంగారం ఉంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని అట్టారి గ్రామంలో జన్మించిన భజన్‌లాల్ శర్మ(Bhajanlal Sharma) మంగళవారం సాయంత్రం మొదటిసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన వారిగా గుర్తింపు పొందారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆయన్ను సీఎం చేస్తున్నట్టు ప్రకటించగానే అందరూ షాక్ అయ్యారు. Also Read: తొలి విజయంతోనే సీఎం.. భజన్‌లాల్ కెరీర్లో ఆసక్తికర విశేషాలు 27 ఏళ్ల వయసులో అత్తారి గ్రామంలో సర్పంచ్‌గా గెలిచి రాజకీయాల్లోకి వచ్చాడు భజనలాల్. సంగనేర్ (జైపూర్) కంటే ముందే, అతను 2003లో సమాజ్ న్యాయ్ మంచ్ పార్టీ టిక్కెట్‌పై నద్‌బాయి (భరత్పూర్) అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు, అయితే ఇండిపెండెంట్ చేతిలో ఆయన ఓడిపోవడమే కాదు.. డిపాజిట్ కూడా రాలేదు. ఏప్రిల్‌లోనే బీజేపీ విజయంపై ప్రకటన.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో భజన్‌లాల్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే బీజేపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లాగా బీజేపీ ఎన్నికల సంవత్సరం వరకు ఎదురుచూడదని అన్నారు. బిజెపి కార్యకర్తలతో భౌతికంగా అనుసంధానించి ఉందని చెప్పారు. ఎన్నికల సన్నాహాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ 100 అడుగులు ముందుందని అప్పుడే ఆయన ప్రకటించారు. ఆయన చెప్పినట్టే రాజస్థాన్ లో కాషాయం జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి పదవి ఆయనను ఏరికోరి వరించింది. Watch this interesting Video : #rajasthan-cm #bhajanlal-sharma #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి