MPDO Venkataramana Rao Missing: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈ నెల 10వ తేది నుంచి 20 వరకు సెలవులపై వెళ్ళిన ఎంపీడీఓ..కానురులోని తన ఇంటికి వెళ్లారు. 15వ తేదిన మచిలీపట్నంలో పని ఉందంటూ కానురు నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రమణారావు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
16వ తేదిన నా పుట్టిన రోజు అదే నా చివరి రోజంటూ భార్య ఫోన్ కు మేసేజ్ పెట్టారని పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. రమణారావు మిస్సింగ్ వెనుక నరసాపురం ఫెర్రీ వేలంపాట కారణమని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకు పంటు ప్రయాణానికి సంవత్సరానికి వేలం నిర్వహిస్తారు.
Also Read: ఫిల్మ్ ఫేర్ అవార్డుల కోసం పోటీ పడుతున్న తెలుగు సినిమాలు ఇవే..
గతంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించగా వైసీపీకి చెందిన నేత రెడ్డప్ప ధావేజి పాట దక్కించుకున్నారు. మండల పరిషత్ కు రూ.50 లక్షలకు పైగా ధావేజీ బకాయి పడినట్లు తెలుస్తోంది. బకాయి వసూలపై ఎంపీడీఓ రమణారావు ఒత్తిడికి లోనయ్యారని బాధితులు వాపోతున్నారు. రెడ్డప్ప ధావేజికి మాజీ వైసీపీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు. తన భర్త రమణారావును తనకు చూపించాలని భార్య కన్నీరుమున్నీరవుతోంది. విచారణ చేపట్టిన పోలీసులు ఎంపీడీఓ ఫోన్ ఏలురు కాలువలో దొరికినట్లు తెలిపారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.