NARA LOKESH:నేడు రాజమండ్రికి వెళ్ళనున్న లోకేష్

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈరోజు రామండ్రికి వెళ్ళనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న లోకేష్ ఈరోజు ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో లోకేష్ రాజమండ్రి బయలుదేరనున్నారు. సాయంత్రం జైలులో చంద్రబాబుతో అతను ములాకత్ కానున్నారు.

NARA LOKESH:నేడు రాజమండ్రికి వెళ్ళనున్న లోకేష్
New Update

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన నారా లోకేష్ ఈరోజు రామండ్రి చేరుకోనున్నారు. ఈరోజు సాయంత్రం రాజమండ్రి సెట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణిలు కలవనున్నారు. ఈ నెల 12వ తేదీన ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌ను ఏపీ సీఐడీ విచారించనున్నారు. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే నోటీసులను అందచేశారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల గురించి బాబుతో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే పార్టీ పరంగా చేపట్టాల్సి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి బాబుతో లోకేష్ మాట్లాడే అవకాశముంది. వీటితో పాటూ టీడీపీ-జనసేన పొత్తు పరిణామాల గురించి చంద్రబాబుతో చర్చించనున్నారని తెలుస్తోంది. బాబుతో భేటీ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశముంది. రేపు రాజమండ్రికి లోకేష్ వస్తుండటంతో భారీగా శ్రేణులు కూడా చేరుకుంటున్నారు. మరోవైపు జైలు దగ్గర పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత రెండుసార్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లోకేష్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు, అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకు  గత నెల 14న లోకేష్ ఢిల్లీకి బయల్దేరారు.  ఢిల్లీలో 20 రోజుల పాటు ఉన్న లోకేష్.. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయి నాయకులను కలిసి చర్చలు జరిపారు.పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టడంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు ఢిల్లీ వేదికగానే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర నేతలతో చర్చించారు. టీడీపీ సమావేశాలకు వర్చువల్ విధానంలోనే లోకేష్ పాల్గొన్నారు. దీంతో పాటు చంద్రబాబు కేసు పరిణామాల గురించి సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.

#chandrababu #today #rajhamundry #jail #nara-lokesh #mulakhath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి