Nara Lokesh: చరిత్ర తిరగరాసిన నారా లోకేష్‌..ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటి వరకు!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మంగ‌ళ‌గిరిలో లోకేష్‌ తన విజ‌య‌ఢంకా మోగించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి లావ‌ణ్య‌పై భారీ మెజార్టీతో గెలిచారు.

New Update
Nara Lokesh: చరిత్ర తిరగరాసిన నారా లోకేష్‌..ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటి వరకు!

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మంగ‌ళ‌గిరిలో లోకేష్‌ తన విజ‌య‌ఢంకా మోగించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి లావ‌ణ్య‌పై భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో టీడీపీ ఎన్నో ద‌శాబ్ధాలుగా గెల‌వ‌ని మంగ‌ళ‌గిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగ‌రేసి చ‌రిత్ర సృష్టించారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే గెలిచింది. 1985లో చివ‌రిగా గెలిచింది. ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ గెల‌వ‌లేదు. ఇక 2019లో లోకేశ్ పోటీ చేసి ఓడినప్పటికీ నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకుని ఉండ‌టం ఇప్పుడు ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం తో లోకేష్‌ పై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త‌ను పెంచాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Also read: పవన్‌ కల్యాణ్‌ కు సినీ ప్రముఖుల అభినందనలు..వైరల్‌ అవుతున్న ట్వీట్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు