/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Nara-Lokesh-Jagan-jpg.webp)
నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే.. ఈ దాడి వెనకు ఉన్నది టీడీపీ నేతలేనని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. సానుభూతి కోసమే ఈ దాడి వైసీపీ నేతలే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా కూడా ఇదే తరహాలో జరిగిందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ దాడి వైసీపీ డ్రామా అంటూ ఆయన పరోక్షంగా కామెంట్స్ చేశారు.
రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా!
కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్! @ysjagan #KodiKathiDrama2 #AndhraPradesh pic.twitter.com/PFbknSy9sg
— Lokesh Nara (@naralokesh) April 13, 2024
జగన్ పై దాడి అంశంపై టీడీపీ, వైసీసీ సోషల్ మీడియాల్లో దుమారం రేగుతోంది. ఈ దాడి జగన్ ను హత్య చేసేందుకు టీడీపీ చేసిన కుట్రగా వైసీపీ సోషల్ మీడియా చెబుతుంటే.. డ్రామా అంటూ తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇరు పార్టీల మద్దతుదారులు సైతం సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
నటనకు నవత తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
అభినయ సిరి గా అభినవ గిరి గా
వచ్చాడు రస రాజు
నిన్ను చూసి మెచ్చాడు నట రాజు#KodiKathiDrama2 #AndhraPradesh pic.twitter.com/CFx1mteuEO— Telugu Desam Party (@JaiTDP) April 14, 2024
సీఎం @ysjagan యాత్రకు వస్తున్న అశేష జనాదరణను చూసి సహించలేకనే కదా చంద్రబాబు.. నీ పచ్చమూకలతో ఇలాంటి దుశ్చర్యకు ఒడిగట్టావు.
ఇలాంటి కుట్రకు పాల్పడిన @ncbn, @JaiTDP ఈసారి రాజకీయ సమాధి అవడం ఖాయం.#MemanthaSiddham#EndOfTDP pic.twitter.com/xRm8d8DXJ3
— YSR Congress Party (@YSRCParty) April 14, 2024