Nara Lokesh: తండ్రికి పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్‌!

నారా లోకేశ్ మంత్రి గా బాధ్యతలు స్వీకరించే ముందు తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు.

New Update
Lokesh: తన భద్రతపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ క్రమంలోనే నారా లోకేశ్ మంత్రి గా బాధ్యతలు స్వీకరించే ముందు తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు.

రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న లోకేష్‌ కి ప్రధానితో పాటు అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు.

Also read: పవన్ కళ్యాణ్ అనే నేను.. మారు మోగిన సభా ప్రాంగణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు