/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-jagan-jpg.webp)
Pavan CM : సీఎం జగన్ బస్సు పర్యటన సమయంలో సూరంపాలెం ఆదిత్య కాలేజీ విద్యార్థులు సీఎం జగన్(CM Jagan) కు వ్యతిరేకంగా 'పవన్ సీఎం', 'జగన్ డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. కాగా పర్యటనలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థులను ఆదిత్య కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేష్(Nara Lokesh) ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే అని అన్నారు.
జగన్ పనైపోయింది, పవన్ ప్రభంజనం మొదలైంది!
మోసపూరిత హామీలిచ్చి ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిన జగన్ పై తిరగబడిన యువత. జగన్ పై తమ అసహనాన్ని పవన్ కళ్యాణ్ గారికి జై కొడుతూ తెలియజేసారు. దీంతో రాష్ట్రంలో యువత బలమైన మార్పు కోరుకుంటున్నారేది మరోసారి స్పష్టం అయింది!… pic.twitter.com/nR5gNpmMDQ
— JanaSena Party (@JanaSenaParty) April 19, 2024
ALSO READ: జగన్‌పై దాడి కేసు.. టీడీపీ నేత బోండా ఉమా అరెస్ట్?
విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యం! జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం అని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా, అందడం లేదంటూ విద్యార్థులు నిరసన తెలపడమే నేరమైందని అన్నారు. వైసీపీ(YCP) నేతలు కాలేజ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వాస్తవాన్ని బయట పెట్టిన విద్యార్థులను సస్పెండ్ చేయించడం దారుణం అని అన్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం తగునా జగన్? చిత్తశుద్ధి ఉంటే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించి, కాలేజీ యాజమాన్యాల వద్ద ఉండిపోయిన 8 లక్షల సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అన్నారు.
జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యం! జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం. కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు… pic.twitter.com/mEZZOHz0FW
— Lokesh Nara (@naralokesh) April 20, 2024