టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఈ రోజు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. లోకేష్ కు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రాజమండ్రికి లోకేష్ రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. నిన్న క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచడం, ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడడం తదితర అంశాలపై లోకేష్ చంద్రబాబుతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Elections: చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్‌కు నష్టమా?
చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ములాఖత్ అనంతరం చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి లోకేష్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యుల్లో టెన్షన్ నెలకొంది. ములాఖత్ లో లోకేష్ వెంట కుటుంబ సభ్యులు ఒకరు, పార్టీ కీలక నేత ఒకరు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.