టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తాజాగా ఏపీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) ఖండిస్తూ.. ఆయనకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు మొత్తం 5 నిమిషాల పాటు శబ్ధం చేస్తూ నిరసన తెలపాలని కోరారు. ఎక్కడ ఉన్నా కూడా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని కోరారు. లేదా విజిల్ వేయాలన్నారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలన్నారు. ఎవరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు లోకేష్.
ఇలా చేయడం ద్వారా అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామన్నారు లోకేష్. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దామన్నారు. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది అని లోకేష్ అన్నారు. ఇదిలా ఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Chandrababu:ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కేసులోనూ లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వచ్చే అక్టోబర్ 4 వరకు లోకేష్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్ గ్రిడ్ లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై విచారణను వచ్చే నెల 4 తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.