/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-23.jpg)
Nara Chandrababu Naidu :దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.
ఈ మేరకు తన ఎక్స్ లో.." నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిండైన ఆత్మీయత కు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, మంత్రి గా, శాసన సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం" అని రాసుకొచ్చారు.
నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిండైన ఆత్మీయత కు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, మంత్రి గా, శాసన సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. pic.twitter.com/GLjBbbG5tO
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2024
Also Read : బన్నీ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిందా?
నందమూరి తారక రామారావు మూడో కుమారుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు. 2018, ఆగస్టు 29 న అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Follow Us