రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలిశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. నేడు ములాఖత్‌లో చంద్రబాబును కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ సిద్ది గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలనంతరం అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ములాఖత్ నేపథ్యంలో జైలు సమీపంలో పోలీసుల భద్రత పెంపు ఎక్కువగా పెంచారు.
This browser does not support the video element.
రాజమండ్రి శ్రీ సిద్ది గణపతి స్వామి దేవస్థానంలో వినాయక చవతి పండుగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సిద్ది గణపతి ఆలయానికి నారా భువనేశ్వరితో పాటు కుటుంబం సభ్యులు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరంల ఆలయం నుంచి లోకేశ్ క్యాంప్ సైట్ వద్దకు భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుందర బయలుదేరారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో నారా భువనేశ్వరీ, నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ కానున్నారు. నారా భువనేశ్వరి వెంట తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు.