AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..!

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించడానికి వెళ్లారు. 4 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ జరిగింది.

New Update
AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..!

NTR District : ఎన్టీఆర్‌ జిల్లా వరదల్లో (Floods) రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ, వైసీపీ (TDP - YCP) శ్రేణుల మధ్య వివాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించడానికి ఆయన వెళ్లారు. అయితే, అతడిని లోపలకు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

Also Read: పాఠశాలలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి..!

వరదలతో ప్రజలు 4 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రానీ మీరు ఇప్పుడెందుకు వచ్చారని మాజీ ఎమ్మెల్యేను టీడీపీ శ్రేణులు నిలదీశారు. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఆర్డీవో ఇరువైపుల వారినీ సముదాయించే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు.

ఈ వివాదంతో మాజీ ఎమ్మెల్యే వెనుతిరిగి కారెక్కగా వారిని కార్యకర్తలు బయటకు లాగే ప్రయత్నం చేశారు. చివరికి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు (Jagan Mohan Rao) అక్కడి నుంచి అవమానంతో వెళ్లిపోయారు.

Advertisment
తాజా కథనాలు