BIG BREAKING: హైదరాబాద్ లో తొలి ఉరిశిక్ష.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భవానీనగర్ పీఎస్ పరిధిలో భార్యను చంపిన ఇంజమ్ హాక్ అనే నిందితుడికి ఉరిశిక్ష విధించింది. 2018 అదనపు కట్నం కోసం భార్యను హతమార్చిన కేసుపై తుది విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.

New Update
BIG BREAKING: హైదరాబాద్ లో తొలి ఉరిశిక్ష.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

Hyderabad: హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జీవితాంతం తోడుంటానని చెప్పిన వాడే మాట తప్పి భార్యను కిరాతకంగా హతమార్చిన వాడి పాపం పడింది. అత్యాశతో భార్యను, ఆమె కుంటుంబాన్ని కష్టాలు పాలు చేసిన వాడికి తగిన శిక్ష విధించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి పాపాలకు ఒడిగట్టేవారి గుండెల్లో దడ పుట్టేలా తీర్పు వెల్లడించింది.

ఇది కూడా చదవండి :Eggs: గుడ్లతో వీటిని కలిపి తినవద్దు.. అనేక రోగాలను కొని తెచ్చుకున్నట్టే!

ఇక అసలు విషయానికొస్తే..  2018 భవానీనగర్ పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసు తుది విచారణ చేపట్టింది నాంపల్లి క్రిమినల్ కోర్టు. ఈ మేరకు వరకట్నం కోసం భార్యను వేధించి, నరకం చూపించి చివరకు కిరాతకంగా చంపిన ఇంజమ్ హాక్ అనే నిందితుడికి ఉరిశిక్ష విధించింది. అయితే  హైదరాబాద్ చరిత్రలో తొలిసారి ఉరిశిక్ష అమలు చేస్తూ తీర్పు వెల్లడించిడం విశేషం. కాగా  ఈ తర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుడికి తగిన బుద్ది చెప్పారంటూ న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు