Bus Accident : నల్గొండ లో బస్సు ప్రమాదం ఒకరు సజీవ దహనం

నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి చీరాల వెళ్తున్న ఓ ట్రావెల్‌ బస్సు నల్గొండ కి రాగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరో 38 మందికి గాయాలు అయ్యాయి.

New Update
Bus Accident : నల్గొండ లో బస్సు ప్రమాదం ఒకరు సజీవ దహనం

Bus Accident : ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా..మరో 38 మందికి గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పాటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి చీరాలకు వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు నల్గొండ జిల్లాలో (Nalgonda District) మర్రిగూడ బైపాస్‌ రోడ్డుకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్‌ తో పాటు మరికొందరు ప్రయాణికులు కిందకి పరుగులు తీశారు.

అయితే మంటలు తీవ్ర తరం కావడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకరు సజీవ దహనం కాగా..మిగిలిన వారిలో ఎంత మందికి గాయాలు అయ్యాయో తెలియాల్సి ఉంది. స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు తీవ్ర తరం కావడంతో బస్సు చాలా వరకు కాలిపోయింది.

చనిపోయిన వ్యక్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల కారణాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి నిద్ర మత్తులో ఉండడంతో సకాలంలో బస్సు దిగలేకపోవడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Also read: భయంకరంగా మైచౌంగ్ తుఫాన్…ఏపీలో దంచికొడుతున్న వానలు…!!

Advertisment
తాజా కథనాలు