Big Breaking: కోమటిరెడ్డి గ్రీన్ సిగ్నల్.. కాంగ్రెస్ లోకి వేముల వీరేశం..

New Update
Big Breaking: కోమటిరెడ్డి గ్రీన్ సిగ్నల్.. కాంగ్రెస్ లోకి వేముల వీరేశం..

ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కాసేపట్లో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను (mallikarjun kharge) వీరేశం కలవనున్నారు. ఖర్గే సమక్షంలో వీరేశం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరేశం చేరికకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నకిరేకల్ టికెట్ దక్కకపోవడంతో వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పై స్పష్టమైన హామీ పొందిన తర్వాతనే ఆయన ఆ పార్టీలోకి చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇన్నాళ్లు వీరేశం చేరికను వ్యతిరేకించిన నకిరేకల్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ సారి ఎలాగైనా అధికారంలోకి భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫోకస్ పెంచింది. ఇతర పార్టీల్లో కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లో టికెట్ ఆశించి భంగపడ్డ వారితో టచ్ లోకి వెళ్తున్నారు హస్తం నేతలు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే తుంగతుర్తికి చెందిన బీఆర్ఎస్ నేత మందుల సామేలు, భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించి ఆయన ఓకే అన్న తర్వాతనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ప్రముఖ గాయకుడు, వైఎస్సాఆర్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న (Apoori Somanna) బీఆర్ఎస్ లో (BRS Party) చేరనున్నారు. ఈరోజు మంత్రి కేటీఆర్ తో సోమన్న సమావేశమయ్యారు. బీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయాన్ని కేటీఆర్ కు సోమన్న స్వయంగా తెలిపినట్లు సమాచారం. సోమన్న నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కవి, గాయకుడు అయిన ఏపూరి సోమన్న తొలుత అరుణోదయ సంస్థలో పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సోమన్న.. తన ఆటాపాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కార్ సోమన్నకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కల్పించింది. అయితే.. కొన్నాళ్లకే సోమన్న ఆ ఉద్యోగాన్ని వదిలి కేసీఆర్ సర్కార్ విధానాలపై తన పాటల ద్వారా పోరాటం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన సోమన్న దాదాపు మూడేళ్ల క్రితం షర్మిల సారథ్యంలోని వైఎస్సాఆర్టీపీలో చేరారు.
Also Read:
Telangana BJP: కిషన్ రెడ్డికి బిగ్ ఝలక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. ఆ వెంటనే..

Advertisment
Advertisment
తాజా కథనాలు