NagaVamsi : దేవర సాంగ్ వచ్చాక ఆ పాటను మర్చిపోతారు.. ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన నిర్మాత!

'దేవర' ఫస్ట్ సింగిల్ మే 19 న రిలీజ్ కానున్నట్టు పోస్టర్ ని రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ.. " మీ అందరి కంటే ముందు నేను పాట విన్నా. నన్ను నమ్మండి. హుకుం పాటను మరిచిపోతారు. అనిరుధ్‌ అందించిన ఈ మాస్‌ పాట మరో స్థాయిలో ఉంటుంది" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

NagaVamsi : దేవర సాంగ్ వచ్చాక ఆ పాటను మర్చిపోతారు.. ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన  నిర్మాత!
New Update

Producer NagaVamsi About Devara First Single : కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుడటంతో 'దేవర' ఆల్బమ్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

కాగా తారక్ బర్త్ డేకి 'దేవర' ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ ఫస్ట్ సింగిల్ విన్న సితార నిర్మాత నాగవంశీ.. సాంగ్ గురించి ఆసక్తికర ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ తో సాంగ్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Also Read : సుచీ లీక్స్.. ఆ వీడియోల వెనక త్రిష హస్తం – వెలుగులోకి సంచలన నిజాలు!

ఆ పాటను మర్చిపోతారు

'దేవర' ఫస్ట్ సింగిల్ మే 19 న రిలీజ్ కానున్నట్టు ఓ పోస్టర్ ని రిలీజ్ చేసిన నాగవంశీ.. " మీ అందరి కంటే ముందు నేను పాట విన్నా. నన్ను నమ్మండి. హుకుం పాటను మరిచిపోతారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ అందించిన ఈ మాస్‌ పాట మరో స్థాయిలో ఉంటుంది" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అంతేకాకూండా ‘దేవర ముంగిట నువ్వెంత..’ అంటూ ఫైర్‌ ఎమోజీ జోడించారు. దీంతో ఫస్ట్ సింగిల్ ‘దేవర ముంగిట నువ్వెంత' అనే లైన్ తో స్టార్ట్ అవుతుందని అర్థమవుతుంది. ఇక ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ దేవర ఫస్ట్ సింగిల్ కోసం మరింత ఎక్సయిట్ మెంట్ తో ఉన్నారు.

#devara-first-single #producer-nagavamsi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి