NAGARJUNA: లాయర్ పాత్రలో నాగార్జున : కింగ్ నాగార్జున కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం లో ఎల్లపుడూ ముందుంటారు. నాగార్జున లిఫ్ట్ ఇచ్చిన డెబ్యూ డైరెక్టర్స్ స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ, దశరథ్, లారెన్స్,నా సామిరంగా దర్శకుడు బిన్నీ, ఇప్పుడు సబ్బు .. ఇలా చెప్పుకుంటూ పోతే నాగ్ కెరీర్ లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న సబ్బుకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారనీ సమాచారం. కోర్టు రూమ్ డ్రామాగా అతి తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో ఈ మూవీ ఫినిష్ అవుతందనీ.. ఈ మూవీలో నాగార్జున లాయర్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.
అధిపతి మూవీలో నాగార్జున లాయర్ పాత్ర
గతంలో నాగార్జున .అధిపతి మూవీలో లాయర్ పాత్ర లో స్పెషల్ అప్పియరెన్స్ కనిపించ అలరించడంతో... ఇప్పుడు ఫుల్లెంగ్త్ రోల్ చేయడానికి ఆసక్తి చూపిస్తునట్లు తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే సంక్రాంతి తరువాత సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంభందించిన కాస్ట్ & క్రూ తెలియాల్సివుంది.ఇక..శేఖర్ కమ్ముల దర్సకత్వంలో తెరకెక్కనున నాగార్జున - ధనుష్ మూవీ కుడా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే సన్నాహాల్లో ఉంది.
జైభీమ్ తరహాలో సామాజిక ఇతివృత్తం
నాగ లాయర్ గా చెయ్యబోయే మూవీ జైభీమ్ తరహాలో సామాజిక ఇతివృత్తం తో తెరకెక్కబోతోందనీ, నిజ జీవిత సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త చక్కర్లుకొడుతోంది. లాయర్ పాత్రలో ,అందులోనూ కోర్ట్ రూమ్ డ్రామా లో నాగ్ చక్కగా ఒదిగిపోతారని మనకు తెలుసు.చూడాలి కొత్త దర్శకుడు నాగార్జునను లాయర్ పాత్రలో ఎలా చూపించబోతున్నాడో.
ALSO READ:Guntur Karam premiere shows: గుంటూరు కారం రిలీజ్ కు ముందే రికార్డులు