Nagarjuna : అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. వైరల్ అవుతున్న ట్వీట్!

కింగ్ నాగార్జున తన అభిమానికి క్షమాపణ చెప్పాడు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని.. ఆయన్ని కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని పక్కకు లాగేశాడు. ఈ వీడియో చూసిన నాగార్జున తన ట్విట్టర్ వేదికగా క్షమాపణ కోరాడు.

New Update
Nagarjuna : అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. వైరల్ అవుతున్న ట్వీట్!

Nagarjuna Says Sorry To His Fan : అభిమాన హీరో బయట కనిపిస్తే వాళ్ళతో సెల్ఫీ దిగాలని, ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని ఏ అభిమానికైనా ఉంటుంది. అలా అనుకోకుండా సెలెబ్రిటీలు బయట కనిపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి టైం లో ఫ్యాన్స్ హీరోలతో సెల్ఫీ దిగడానికి ఒక్కోసారి సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా వాళ్ళని దాటుకుని వెళ్తుంటారు. తాజాగా మన అక్కినేని హీరో కింగ్ నాగార్జున విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.

తాజాగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని.. ఆయన్ని కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఒకతను ఆ అభిమానిని పక్కకు లాగేశాడు. ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన నాగార్జున తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Also Read : వైజ‌యంతి ఐపీఎస్.. ‘NKR21’లో విజయశాంతి ఫస్ట్ లుక్..!

ఈ మేరకు అయన ట్వీట్ చేస్తూ."ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. సదరు వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను" అని రాసుకొచ్చాడు. దీంతో నాగ్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు