Nagarjuna Sagar: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకోనుంది.

New Update
Nagarjuna Sagar:  నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar Dam: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దీంతో జలకళతో కలకలలాడుతున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు అధికారులు తెరిచారు.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకుంది. దీంతో గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదలాలని అధికారులు నిర్ణయించారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 575 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో సోమవారం ఉదయానికి పూర్తి స్థాయిలో నిండనుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్ కి 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

Also Read: కేరళలో మరోసారి నిపా వైరస్‌ కలకలం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు