Nagarjuna : కాబోయే కోడలు శోభితపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. అందరి ముందే అలా అనేశాడేంటి!

నాగ చైతన్య, శోభిత తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే శోభిత గురించి నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 'గూఢచారి' సక్సెస్ మీట్ లో నాగ్..' శోభితా చాలా అందంగా, చాలా హాట్‌గా కనిపించింది. తనలో అందరినీ అట్రాక్ట్‌ చేసే శక్తి ఉందని' అన్నారు.

Nagarjuna : కాబోయే కోడలు శోభితపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. అందరి ముందే అలా అనేశాడేంటి!
New Update

Nagarjuna Akkineni : సమంత తో విడాకుల తర్వాత అక్కినేని నాగ చైతన్య.. శోభిత దూళిపాళతో గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ జంట పలుమార్లు మీడియా కంట పడటం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ జంట ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు.

వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాగార్జున.. ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కాబోయే కోడలు శోభితా గురించి నాగార్జున గతంలో చేసన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

Also Read : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి.. నాగ చైతన్య – శోభిత జాతకం పై సంచలన పోస్ట్!

అడవి శేష్‌, శోభితా జంటగా 2018 లో 'గూఢచారి' మూవీ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న నాగార్జున శోభితాపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. " ఈ సినిమాలో శోభితా ధూళిపాళ చాలా అందంగా ఉంది. అనకూడదు కానీ. ఆమె చాలా హాట్‌గా కనిపించింది. తనలో అందరినీ అట్రాక్ట్‌ చేసే శక్తి ఉంది. ఇందులో తన పాత్ర చాలా బాగుంది. టెర్రరిస్టుల స్పై అనే తెలియకుండ ఆమె పాత్ర చాలా చక్కగా దాచారు.

ఈ సినిమాలో అడవి శేష్ ఎలా కావాలో అలా ఉంది ఈ అమ్మాయి. నిజంగా చాలా చాలా అందంగా ఉది. అందమే కాదు ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో నాగ్ చేసిన ఈ కామెంట్స్ ను నెటిజన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌ చేస్తున్నారు.

#shobita-dhulipala #nagarjuna-akkineni
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe