Telangana: 'అన్నా ఇటు వచ్చేయ్'.. నాగం జనార్థన్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్..! నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. త్వరలోనే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి, మంచి ముహూర్తం చూసుకుని గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పారు. కాగా, నాగం జనార్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. By Shiva.K 29 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Nagam Janardhan Reddy: సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్(Congress) పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతానంటూ ప్రకటించారు. మంచి ముహూర్తం నిర్ణయించుకుని బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరుతానని తెలిపారు. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఆయన ఇంటికి వెళ్లారు. వీరిద్దరూ కలిసి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. వీరి భేటీలో పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నాగం జనార్దన్ రెడ్డి.. కార్యకర్తల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. మంచి ముహూర్తం చూసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మంత్రి @BRSHarish కలిశారు. హైదరాబాద్లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ క్రమంలో నాగం జనార్దన్ రెడ్డిని మంత్రులు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.… pic.twitter.com/mGNlkWPc5R — BRS Party (@BRSparty) October 29, 2023 ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పొద్దున పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తుందని, ఏళ్ల కొద్ది పార్టీ కోసం పని చేసిన వారికి హ్యాండిస్తోందని కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్న వారికే కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. పార్టీ జెండాలు మోసిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం లేదన్నారు. నాగర్ కర్నూల్ భవిష్యత్ కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌లో చేరుతున్నానని ప్రకటించారు నాగం. మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి పని చేస్తానన్నారు. ఇక నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ అవమానించిందని మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. నాగంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దమోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నాగర్ కర్నూల్ టికెట్ ఇచ్చింది. దీంతో నాగం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఏళ్లపాటు పార్టీ కోసం కష్టపడినవారి కాకుండా పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన నాగం జనార్ధన్ రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన నాగం జనార్దన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌లో ఆయన్ను కలిసి పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. అంతకు ముందు నాగం జనార్దన్ రెడ్డికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సంయుక్తంగా వెళ్లి ఆయన్ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. దాంతో పార్టీలో చేరేందుకు అంగీకరించిన నాగం.. అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎంను కలిశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయిన తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి శ్రీ నాగం జనార్దన్ రెడ్డి.#KCROnceAgain pic.twitter.com/8EmA7fi7d0 — BRS Party (@BRSparty) October 29, 2023 Also Read: ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు.. ముగ్గురు మృతి.. మీ పిల్లలకు పదే పదే జ్వరం వస్తుందా? ఇదే కారణం కావొచ్చు..! #telangana-news #telangana-elections-2023 #nagarkurnool #nagarkurnool-news #nagam-janardhan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి