Nagababu Vs Rgv: మీరు బతికి ఉన్నారని మీ ఫీలింగ్‌ మాత్రమే వర్మగారు..నాగబాబు రీ కౌంటర్‌!

''వర్మ గారు మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్ కి కూడ గురయ్యాను ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది...'' అంటూ మెగా బ్రదర్‌ నాగబాబు ఆర్జీవీ కి మరో కౌంటర్‌ ఇచ్చారు.

New Update
Nagababu Vs Rgv: మీరు బతికి ఉన్నారని మీ ఫీలింగ్‌ మాత్రమే వర్మగారు..నాగబాబు రీ కౌంటర్‌!

టాలీవుడ్‌ లో కాంట్రవర్సీకి పెట్టింది పేరుగా తయారైన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ గత రెండు రోజులుగా వార్తల్లో సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ న్యూస్ ఛానెల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీ తల నరికి తీసుకుని వస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆర్జీవీ సదరు టీవీ యజమాన్యం, టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు , యాంకర్‌ సాంబయ్య మీద డీజీపీకి కంప్లైంట్‌ ఇచ్చారు. తాజాగా ఈ ఈష్యూలోకి మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ఎంటర్‌ అయ్యారు. ''ఆర్జీవీగారు మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇండియాలోనూ ఏ పనికిమాలిన వెదవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవడు చంపడు కదా.. సో మీరేం వర్రీ అవకండి. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు’ అంటూ ఆర్జీవీకి కౌంటర్‌ ఇచ్చారు.

దీంతో నాగబాబు కౌంటర్‌ కి ఆర్జీవీ వెంటనే రీ కౌంటర్‌ వేశారు. ‘సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి’ అంటూ సెటైర్లు వేశారు. దీంతో వీరిద్దరి పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారాయి.

తాజాగా నాగబాబు మరోసారి ఆర్జీవీ ట్విట్టర్‌ కి ఎన్‌ కౌంటర్‌ ఇచ్చారని చెప్పుకొవచ్చు... '' వర్మ గారు మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్ కి కూడ గురయ్యాను ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు మీ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి మీరు, Any how ఏదోక రూపం లో నా పోస్ట్ కి Answer ఇచ్చినందుకు సంతోషం,ఎప్పటికి మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారు.

publive-image

మరీ దీనికి ఆర్జీవీ ఏ విధంగా కౌంటర్‌ ఇస్తారో చూడాలి.

Also read: నన్ను క్షమించండి.. ఆమె నా కజిన్: వీడియోపై విశాల్ వివరణ

Advertisment
తాజా కథనాలు