Revanth Reddy-Naga Babu: రేవంత్ రెడ్డిపై నాగబాబు ప్రశంసల వర్షం.. ఇప్పటికైనా అర్థమైందా అంటూ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్‌పై నటుడు నాగబాబు ప్రశంసలు కురిపించారు. ‘ఇప్పటికైనా అర్థమైందా.. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది‌’ అన్నారు. రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపారు.

New Update
Revanth Reddy-Naga Babu: రేవంత్ రెడ్డిపై నాగబాబు ప్రశంసల వర్షం.. ఇప్పటికైనా అర్థమైందా అంటూ..

Revanth Reddy-Naga Babu: సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకృతి విశ్వరూపాన్ని ఉద్దేశిస్తూ.. చెరువులు కబ్జాలు చేసి భవనాలు కట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డికి హ్యాట్సప్ చెప్పారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన నాగబాబు.. ‘వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి, అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు వస్తున్నాయి. కొన్ని సామన్య ప్రాణాలు బలికావడం చాలా బాధకారం. వీటికి ముఖ్యకారణం చెరువులు, నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే. ఇప్పటికైన అర్ధమైందా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది‌. ముఖ్యమంత్రి చేస్తున్న పనికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా’ అంటూ రాసుకొచ్చారుస నాగబాబు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు