Nagababu: జనసేన శ్రేణులకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆసక్తికర సూచనలు చేశారు. ఇది ఆలోచించాల్సిన సమయం కాదని, నాయకుడి ఆదేశాలను ఆచరణలో పెట్టాలంటూ ట్వీట్ చేశారు. ‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్ధం కావాల్సిన సమయం. విమర్శ, విభేదాలకు సమయం కాదిది.. విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్.. తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్. నిర్లక్ష్యం వీడు.. నిజాన్ని చూడు. నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సేనా.. సిద్ధం సిద్ధం అన్నోళ్లకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అంటూ పోస్టులో రాసుకొచ్చారు. అలాగే 'నాయకుడి నిర్ణయం వైపు నిలబడు.. నాయకుడి తో కలిసి కలబడు.. సేనాని సిద్దం. సేనా... ఇక ప్రత్యర్థి కి ఇద్దామ యుద్ధం' అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ఇది కూడా చదవండి:Karnataka: ‘పాకిస్థాన్ మద్దతుదారులను కాల్చిచంపాలి’.. కర్ణాటక మంత్రి కాంట్రవర్సీ కామెంట్స్!
ఇక లోక్ సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కలుపుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటు చేసేశారు. ఢిల్లీకి చంద్రబాబును వెంటపెట్టుకుని మరీ వెళ్లిన పవన్.. ఊహించినట్లుగానే బీజేపీతో జత కలిశారు. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఎన్డీయే కూటమి రూపంలో ఎన్నికలకు సిద్ధం కావడం ఒకటే మిగిలి ఉండగా నాగబాబు పిలుపు ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.