/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T180502.507-jpg.webp)
Naga Chaitanya: సహజంగా హీరోలు, హీరోయిన్స్ తమ పర్సనల్ అసిస్టెంట్స్ కు సంబంధించిన ఈవెంట్స్ కు హాజరవడం గమనిస్తుంటాము. అంతే కాదు కొంత మంది హీరోలు తమ అసిస్టెంట్స్ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే ఒకటి చేశారు స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య.
తండేల్ సెట్స్ లో నాగ చైతన్య అసిస్టెంట్ బర్త్ డే సెలెబ్రేషన్స్
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 'తండేల్' మూవీ సెట్స్ లో తన అసిస్టెంట్ వెంకటేష్ బర్త్ డే సెలెబ్రేట్ చేశారు నాగ చైతన్య. స్వయంగా దగ్గరుండి తన అసిస్టెంట్ తో కేక్ కట్ చేయించారు. చై తో పాటు సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి కూడా అతనికి బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఇలా సొంత వాళ్ళలా చూసుకునే చైతూ మనస్తత్వం చూసి నెటిజన్లు ప్రసంశిస్తున్నారు.
Our Queen @Sai_Pallavi92 🥹🤍 from the sets of #Thandel movie celebrating @chay_akkineni 's assistant Venki Bday ❤️#SaiPallavi @chandoomondeti pic.twitter.com/YwbFzksCSG
— SaiPallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) March 10, 2024
తండేల్ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీత ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న ఈ చిత్రంలో... జాలరి రాజు పాత్రలో నాగచైతన్య , సత్య పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Also Read: Anchor Rashmi: రష్మి ఇంట తీవ్ర విషాదం.. స్టార్ యాంకర్ కంట కన్నీరు😿