Nag Ashwin : 'కల్కి' విషయంలో కొన్ని తప్పులు చేశాను : నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్ తాజాగా 'కల్కి' సెట్‌లో మీడియాతో చాలాసేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు. ఫస్టాప్ ల్యాగ్ అయిందనే దానిపై మాట్లాడుతూ.." కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నాం. మ్యూజిక్ కూడాఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది" అని అన్నాడు. By Anil Kumar 07 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Nag Ashwin About 'Kalki' Mistakes : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా 'కల్కి' ఫీవర్ నడుస్తోంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) - ప్రభాస్ (Prabhas) కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27 న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ గ్రాఫిక్స్, అదిరిపోయే విజువల్స్ తో మహాభారతాన్ని ఇప్పటి తరం వాళ్లకు చూపించడంలో నాగ్ అశ్విన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాలో కొన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఆడియన్స్ వాటిని పెద్దగా పట్టించుకోకుండా సినిమాను థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కల్కి (Kalki 2898AD) విషయంలో జరిగిన పొరపాట్లను డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం నిజాయితీగా ఒప్పుకున్నాడు. తాజాగా 'కల్కి' సెట్‌లో మీడియాతో చాలాసేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు. Also Read : ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే? డీటైల్డ్‌గా చెప్పాలనే అలా... " కల్కిలో మేజర్ కంప్లైంట్స్ విషయానికొస్తే ఫస్టాప్ ల్యాగ్ అయిపోయింది. సినిమాని రెండు పార్ట్స్‌గా తీయాలనే ఉద్దేశంతో పాటు కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నాం. అలానే ఫస్టాప్ సీన్స్ కంటే ఎడిటింగ్‌ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చేసుండాల్సింది. మ్యూజిక్ కూడా కొన్నిచోట్ల ఎక్స్‌ట్రార్డీనరీగా వస్తే, కొన్నిచోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. అనే అన్నాడు. మాకూ అదే అనిపించింది... " మహానటి లానే ఇందులోనూ నటీనటులతో సొంతంగా డబ్బింగ్ చెప్పించాం. చివరి నిమిషంలో తొందర వల్ల బహుశా సరైన ఫినిషింగ్ రాలేదేమో పట్టి పట్టి చెప్పినట్లు ఉందని మాకు కూడా అనిపించిందని నాగ్ అశ్విన్ అన్నాడు. యాక్ట్ చేసినవాళ్లు డబ్బింగ్ చెబితే 100 శాతం ఫెర్ఫెక్ట్ ఉంటుందనేది నా అభిప్రాయం" అని తెలిపాడు. తాను చేసిన మిస్టేక్స్ ను అందరి ముందు స్వయంగా ఒప్పుకోవడంతో నాగ్ అశ్విన్ నిజాయితీపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. #prabhas #nag-ashwin #kalki-2998-ad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి