Mystery Girl: రోహిత్‌, పాండ్యాతో ఫొటో దిగిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరు? భలే క్యూట్‌గా ఉందిగా!

రోహిత్‌, పాండ్యాతో ఓ అమ్మాయి దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అమ్మాయి ఎవరన్నదానిపై అభిమానులు నెట్టింట్లో తెగ సేర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు సెజల్. ఫిజియోథెరపిస్ట్‌, మోడల్ కూడా. పలు టీవీ సీరియల్స్‌ కూడా నటించిన ఈ క్యూట్‌ గర్ల్‌ ముంబై ఇండియన్స్‌కు వీరాభిమాని.

Mystery Girl: రోహిత్‌, పాండ్యాతో ఫొటో దిగిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరు? భలే క్యూట్‌గా ఉందిగా!
New Update

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తడబడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముందుగా గుజరాత్‌పై ఓడిపోయిన ముంబై తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పైనా ఓడిపోయింది. ఓవైపు పాండ్యా వర్సెస్ రోహిత్ ఫ్యాన్‌ వార్‌ సోషల్‌మీడియాలో రచ్చ లేపుతుండగా.. మరోవైపు ఒక మహిళ ముంబై ప్లేయర్‌లతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మహిళ ఎవరో తెలుసుకోవాలని ముంబై అభిమానులు తహతహలాడుతున్నారు. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాతో కనిపించిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసుకోవాలని నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు.



ఎవరీ మిస్టరీ గర్ల్?

సెజల్ జైస్వాల్ ఒక నటి. ఆమె గతంలో ఫిజియోథెరపిస్ట్‌. ఆమె 'దిల్ మాంగే' మోర్, 'డేటింగ్ ఇన్ డార్క్' లాంటి అనేక టీవీ సీరియల్స్‌లో కనిపించింది. 19 సంవత్సరాల వయస్సులో, ఆమె మోడలింగ్‌లోకి ప్రవేశించింది. ఆమె ముంబై ఇండియన్స్‌కు వీరాభిమాని. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరితో కలిసి ఫ్లైట్‌లో ఫొటోలను క్లిక్ చేయడం కనిపిస్తుంది. కొన్నిసార్లు సెజల్ రోహిత్ శర్మతో కనిపించింది.. కొన్నిసార్లు ఆమె జట్టు బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో ఫొటోలను క్లిక్ చేసింది. ఓ రీల్‌లో టిమ్ డేవిడ్, పీయూష్ చావ్లా, తిలక్ వర్మ సహా ముంబై ఆటగాళ్లందరూ ఉన్నారు. ఈ పోస్ట్‌లపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.



ముంబై.. ప్చ్‌:

ఒకప్పుడు ఐపీఎల్‌ను శాసించిన ముంబై 2021 నుంచి ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కొత్తగా పాండ్యాను కెప్టెన్‌ను చేసినా రాత మారలేదు. అందులోనూ పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజారత్‌, హైదరాబాద్‌పై మ్యాచ్‌ల్లో పాండ్యా పలు తప్పిదాలు చేశాడని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్నటి హైదరాబాద్‌ మ్యాచ్‌లో కీలక సమయంలో పాండ్యా స్లోగా బ్యాటింగ్‌ చేయడం విమర్శలకు దారి తీసింది.

Also Read: ఉప్పల్‌లో కొడితే బాల్‌ తుప్పల్లో పడిందంటే ఇదేనేమో.. ఇంత అరాచక మ్యాచ్‌ ఎప్పుడూ చూడలేదు భయ్యా!

#rohit-sharma #mumbai-indians #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe