Dog Disease: శునకాలకు వింత వ్యాధి.. ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్న వైద్యులు.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో శునకాలకు వింత వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. ఈ వ్యాధిలో దగ్గులు, తుమ్ములు, నీరసం, న్యూమోనియా వంటి లక్షణాలున్నాయి. అసలు ఈ వ్యాధి ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి వైద్య నిపుణులు అనారోగ్యానికి గురైన శునకాల నుంచి శాంపిల్స్ తీసుకొని పరిశోధనలు చేస్తున్నారు. By B Aravind 21 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి చాలామంది తమ పెంపుడు జంతువులుగా శునకాలను ఇష్టంగా పెంచుకుంటారు. ఏ జీవికి లేని విశ్వాసం శునకానికి ఉంటంది. అలాగే ఇది ఇంటికి రక్షణగా ఉంటుంది. ఇక విధి శునకాలకు కూడా ఎవరైన అన్నం పెడితే ఆ ప్రాంతంలోనే అక్కడే ఉండిపోతాయి. అయితే శునకాలకు కూడా అప్పుడప్పుడు వివిధ రకాల వ్యాధులు కూడా వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పెంపుడు శునకాలు ఉన్నవారు వాటిని పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు. ఇక విధి కుక్కల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. అయితే అమెరికాలోని ప్రస్తుతం శునకాలకు ఓ వింత వ్యాధి వ్యాపిస్తోంది. మరో విషయం ఏంటంటే అసలు ఇది ఏం వ్యాధి, ఎలా వచ్చింది అనే విషయం కూడా వెటర్నరీ వైద్యులు చెప్పలేకపోతున్నారు. ఈఏడాది ఆగస్టులో ఒరెగాన్ అనే రాష్ట్రంలో ఉన్న శునకాలకు మొదటగా ఈ వింత వ్యాధి బారినపడ్డాయి. ప్రస్తుతం అక్కడ దాదాపు 200లకు పైగా ఈ కేసులు ఉన్నట్లు ఒరెగాన్ అగ్రికల్చర్ విభాగం అధికారులు తెలిపారు. అలాగే కోలొరాడో, ఇల్లినోయిస్, న్యూహ్‌స్పైర్ రాష్ట్రాల్లో కూడా పలు శునకాలు ఈ వ్యాధి భారీన పడ్డాయి. అయితే ఈ వ్యాధిలో దగ్గులు, తుమ్ములు, నీరసం, నిమోనియా వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ లక్షణాలు కనిపించిన శునకాలకు చికిత్స చేసినా కూడా ఆ లక్షణాలు తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాధికి గురైన శునకాలు వివిధ చోట్ల ఇతర శునకాలతో కలిసిపోతున్నాయని.. దీనివల్ల ఆ వ్యాధి ఇతర శునకాలకు కూడా వ్యాపిస్తోందని చెబుతున్నారు. Also Read: పార్లమెంట్ లో బాంబు పేల్చిన ప్రతిపక్షం…ఎక్కడంటే! అందుకే పెంపుడు జంతువులు ఇలాంటి వ్యాధి బారిన పడుకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని యజమానులకు సూచనలు చేస్తున్నారు. ఇతర కుక్కల నుంచి తమ పెంపుడు శునకాలను దూరంగా ఉంచాలని.. ముఖ్యంగా అనారోగ్యానికి గురైన శునకాలతో కలవనీయకుండా చేయాలని చెబుతున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం వైద్య నిపుణులు ఈ వ్యాధి గల కారణాలను తెలుసుకునేందుకు.. అనారోగ్యానికి గురైన శునకాల నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనలు చేస్తున్నారు. #dogs #america-news #us #disease-in-dogs #dog-disease మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి