Modi: నా జీవితం రైలు పట్టాలపైనే మొదలైంది.. ఆ బాధేంటో బాగా తెలుసు!

గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు. తన జీవితం రైలు పట్టాలపై మొదలైందని, ఆ కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఆ బాధలు లేకుండా చేయడమే మోడీ గ్యారెంటీలు అన్నారు.

Delhi High Court : ప్రధాని మోదీకి బిగ్ రిలీఫ్..అనర్హత పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
New Update

Gujarath: భారత ప్రధాని నరేంద్రమోడీ (Pm modi)మరోసారి తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అందరిలాగే తాను సామాన్యుడినని, బతకడం కోసం ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పారు. అంతేకాదు పేదల కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసని, అందుకే దేశంలో పేదలు లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోడీ.. ఈ సంరద్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు.

రైలు పట్టాలపై మొదలైంది..

ఈ మేరకు తన జీవితం రైలు పట్టాలపై మొదలైందని చెప్పారు. అందుకే అక్కడ ఉండే కష్టాల గురించి తనకు బాగా తెలుసని, దేశం కోసమే తప్ప రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు తమ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం లేదని పేర్కొన్నారు. ఓట్ల కోసమే బీజేపీ సర్కారు ఈ చర్యలను చేపట్టిందంటూ కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఆరోపణలు. నా జీవితాన్ని రైలు పట్టాలపైనే ప్రారంభించా. గతంలో మన రైల్వేల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉండేది. గత తరాలు అనుభవించిన బాధలను భవిష్యత్తు తరాలకు ఇవ్వకుండా ఉండడమే మోడీ గ్యారెంటీ. వీలైనంత వేగంగా దేశంలో పేదరికం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం' అని ప్రధాని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Encounter: ఢిల్లీలో ఎన్ కౌంటర్ కలకలం.. పోలీసులపై కాల్పులు!

2 నెలల్లో లక్షల కోట్ల ఖర్చు..

అలాగే బీజేపీ ప్రభుత్వం ఈ పదేళ్లలో రైల్వేల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పారు. గతంతో పోలిస్తే 6 రేట్లు అధిక మొత్తాన్ని ఖర్చు పెట్టామని, 2 నెలల్లోనే రూ.11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు చేపట్టినట్లు తెలిపారు. చివరగా అయోధ్య కోసం ఏర్పాటు చేసిన 350 ఆస్తా రైళ్ల ద్వారా ఇప్పటివరకు 4.5లక్షల మందికి శ్రీరాముడి దర్శనం కల్పించామని మోడి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారమిస్తే దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

#gujarath #pm-modi #railway-tracks
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe