Mustard Benefits: ఆవాలతో ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది వంటల్లో వాడే ఆవాలు అందరికి తెలిసివవే. ఆవాలు వంటకాల్లో, ఆరోగ్య ప్రయోజనాలే కాదు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. మనపై ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తొలగిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. By Vijaya Nimma 01 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Mustard Benefits: నిత్యం మనం వంటల్లో వాడే దినుసుల్లో ఆవాలు అతి ముఖ్యమైనవి. తాలింపులో కచ్చితంగా ఆవాలు ఉండాల్సిందే. ఆవాలు లేని వంటలను ఊహించలేం. ఇలా వంటకాల్లో ఆవాలు వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఆవాలతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. మన కోరికలను తీర్చడంతో పాటు మనం పట్టుకుందల్లా బంగారం అయ్యేలా చేసే శక్తి ఆవాలకు ఉంది. అంతేకాకుండా చెడును తొలగించి మనం కోరుకున్న వారిని మన వశం చేయడం, శత్రువులను కూడా మిత్రులుగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. మనపై ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తొలగిస్తాయి. ఆవాలతో ఎలా చేస్తే పరిహారం చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: చలికాలంలో మగవాళ్లు మెంతికూర తింటే ఏమవుతుంది? సాధారణంగా రెండు రకాల ఆవాలు మనకు మార్కెట్‌లో దొరకుతాయి. అవి నల్ల ఆవాలు, మరొకటి పసుపు ఆవాలు. చెడు ప్రయోగాలను తొలగించడానికి పసుపు ఆవాలు బాగా పనిచేస్తాయి. పసుపు ఆవాలు దొరక‌్కపోతే ఇంట్లో ఉండే నల్లటి ఆవాలను కూడా వాడవచ్చు. ఆది, మంగళ, శనివారం రోజు మాత్రమే ఇలా చేయాలని అంటున్నారు. చెడు ప్రయోగాలతో ఇబ్బంది పడుతుంటే ఎడమ చేతిలో ఒక గుప్పెడు ఆవాలు తీసుకుని అందులో మూడు చిటికెల కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఎడమ చేతితో నుదుటి భాగం నుంచి కాలి బొటన వేలు దాకా శరీరం మొత్తం తాకుతూ మూడుసార్లు దిగదుడవాలి. ఆ తర్వాత తల చుట్టూ 11 సార్లు తిప్పుకుని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. కాకపోతే దీన్ని ఎవరికి వారే చేసుకోవాలి. ఇలా చేస్తే మనలో ఉండే చెడుపోయి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా దిష్టి తీసుకోండి: అంతేకాకుండా దిష్టి తగిలిందని అనుకున్నప్పుడు ఈ ఆవాలను, రాళ్ల ఉప్పును కలిపి చేతిలో పట్టుకుని తలచుట్టూ అటుఇటు మూడుసార్లు తిప్పి పడేయాలి. ఇలా చేస్తే నిమిషాల్లోనే నరదిష్టిపోతుందని పండితులు అంటున్నారు. అంతేకాకుండా పసుపు రంగు ఉన్న ఆవాలు అధిక ఫలితాలు ఇస్తాయి. ఇంటికి దిష్టి సోకినా, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే ఆవాలను చేతిలో ఉంచుకుని ఇళ్లు మొత్తం తిరిగి ఆ తర్వాత దూరంగా వేయాలి. ఇలా చేస్తే దుష్టసమస్యల వల్ల వచ్చే సమస్యలు తొలగిపోవడంతో పాటు మన చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుందని, మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మల్లెపూలతో టీ.. ఎప్పుడైనా ట్రై చేశారా? #health-benefits #mustard మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి