Musk Optimus Zen 2: మస్క్ మామ మళ్ళీ ఏమో చేశాడు బ్రో.. రోబోను మనిషిని చేసేస్తాడా ఏమి?

ఎలోన్ మస్క్.. టెస్లా  నుంచి కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2'ని తీసుకువచ్చాడు. ఇది సూపర్ మార్కెట్‌లలో షాపింగ్ చేయడం నుంచి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వరకూ పనులు చేస్తుంది. దీనిని టెస్లా ఫ్యాక్టరీలో ఉపయోగించనున్నారు. 

New Update
Musk Optimus Zen 2: మస్క్ మామ మళ్ళీ ఏమో చేశాడు బ్రో.. రోబోను మనిషిని చేసేస్తాడా ఏమి?

Musk Optimus Zen 2: టెస్లా తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2'ని ఆవిష్కరించింది. ఈ అప్‌గ్రేడ్ చేసిన మోడల్ 30% వేగంగా రన్ చేయగలదు. మెరుగైన బ్యాలెన్స్‌ను కలిగి ఉంటుంది. దీని బరువు కూడా 10 కిలోలు తక్కువ. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ రోబోట్ వీడియోను షేర్ చేశారు. ఆప్టిమస్‌కి ఇది ఒక ముఖ్యమైన అప్ డేట్ వెర్షన్. ఒక సంవత్సరం క్రితం దీనిని మొదటి సరి తీసుకువచ్చినపుడు అది సహాయం లేకుండా నడవలేదు. రోబోట్ ఆప్టిమస్ మొదటిసారి సెప్టెంబర్ 2022లో పరిచయం చేశారు. ఇది 5.8 అడుగుల పొడవు,  50 కిలోల బరువు ఉంటుంది. ఈ రోబోను టెస్లా ఫ్యాక్టరీలో ఉపయోగించనున్నారు.

ఈ రోబో(Musk Optimus Zen 20 అచ్చం మనిషిలానే ఉంటుంది.. ఇది  సూపర్ మార్కెట్‌లలో షాపింగ్ చేయడం నుంచి ఫ్యాక్టరీ ఉత్పత్తి మార్గాలలో పని చేయడం వరకు మానవ పనులను నిర్వహించడానికి వీలుగా రూపొందించారు.. Optimus ధర ఎంత అనేదానిపై టెస్లా ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

మరింత మెరుగైన బ్యాలెన్సింగ్.. 

 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో మస్క్ షేర్ చేసిన వీడియోలో, రోబోట్ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ, స్క్వాట్‌లు చేస్తూ కనిపించింది. రోబోట్ ఈ వెర్షన్ మునుపటి మోడల్‌ల కంటే 30% వేగంగా పని చేస్తుంది.

కోడిగుడ్లను జాగ్రత్తగా.. 

రోబోట్(Musk Optimus Zen 2) చేతులు మార్పు చేశారు.  ఇది మునుపటి వెర్షన్ కంటే వేగంగా ఉంటుంది. ఇది సున్నితమైన - బలమైన వస్తువులను ఎలా ఎత్తాలో అర్థం చేసుకుంటుంది. వీడియోలో, రోబోట్ గుడ్లను తీయడం.  వాటిని మరొక ప్రదేశంలో ఉంచడం కనిపిస్తుంది.

డాన్సులు చేస్తోంది.. 

రోబోట్ కొత్త వెర్షన్ మనుషులు చేసినట్టే డాన్స్ మూమెంట్స్ ను అనుసరిస్తుంది. మెరుగైన మానవ పాదాల జ్యామితి - కొత్త కాలి విభాగం వంటి కొత్త సాంకేతిక పురోగతుల కారణంగా 'Optimus Gen 2' దీన్ని చేయగలదు.

టెస్లా ఫ్యాక్టరీలో ఉపయోగిస్తారు… అమ్మకానికి కూడా.. 

 త్వరలో తన స్వంత తయారీ కార్యకలాపాలలో రోబోలను(Musk Optimus Zen 2) ఉపయోగించడం ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. టెస్లా రోబోల విక్రయాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఆప్టిమస్‌పై మునుపటి అప్‌డేట్‌లో, ఆప్టిమస్ రోబోట్ కోసం డిమాండ్ 10 నుంచి  20 బిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని టెస్లా CEO ఎలోన్ మస్క్ పేర్కొన్నారు.

Also Read: నిర్మాణరంగ  కాలుష్యాలతో నగరాలు విలవిల..డెబ్రిస్ లెక్కలూ లేవు 

మస్క్ చెబుతున్న దాని  ప్రకారం, ఆప్టిమస్ రోబోట్ ప్రమాదకరమైన, రిపీటెడ్ పనులను కూడా చేయగలుగుతుంది.  Optimus మొదటి దశ రోబోలు  ఫ్యాక్టరీ అంతస్తులో ఉపయోగిస్తారు. రోబోట్ సామర్థ్యాలు కాలక్రమేణా మెరుగవుతూనే ఉంటాయని, వివిధ రకాల పనులను నిర్వహించడానికి ఇది ఒక అమూల్యమైన ఆస్తిగా మారుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.

యోగా కూడా చేస్తుంది.

అంతకుముందు సెప్టెంబర్ 25న టెస్లా తన రోబో గురించి అప్‌డేట్ ఇచ్చింది. రోబో తన స్వంత చేతులు,  కాళ్ళను చక్కగా కడపగలదని చెప్పారు. అలాగే రోబో  యోగా కూడా చేయగలదన్నారు. అంతేకాదు,  ఈ రోబోట్ చాలా త్వరగా - మెరుగ్గా వివిధ పనులను నేర్చుకుంటుంది. యోగా చేస్తున్న రోబో ఫోటోను మస్క్ షేర్ చేశాడు. ఈ ఫోటోపై 'నమస్తే' అని రాశారు.

టెస్లా కారు అధునాతన డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ 'ఆటోపైలట్'లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్‌వేర్ - సెన్సార్‌లను హ్యూమనాయిడ్ రోబోట్ 'ఆప్టిమస్' ఉపయోగిస్తుంది. ఈ రోబో టెస్లా చిప్‌పై పనిచేస్తుంది. రోబోట్ 2.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది, ఇది రోజంతా సులభంగా పని చేయగలదు. Wi-Fi - LTE సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

Watch this interesting Video:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు