Music Maestro Rashid Khan Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..

ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) కన్నుముశారు. ప్రొస్టెట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత నెలలో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటుండగా ఈరోజు మధ్యాహ్నం 3.45 PM గంటలకు కన్నుముశారు.

New Update
Music Maestro Rashid Khan Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..

చిత్ర పరిశ్రమలో విషాదం తెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) తుదిశ్వాస విడిచారు. ప్రొస్టెట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత నెలలో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటుండగా ఈరోజు మధ్యాహ్నం 3.45 PM గంటలకు కన్నుముశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. దేశానికి, సంగీత ప్రపంచానికి తీరని లోటంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. రషీద్‌ ఖాన్‌ను కాపాడేందుకు మా సాయశక్తుల ప్రయత్నించామని చివరికి ఫలితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు.

Also Read: సంక్రాంతి పండక్కి మరో 6 ప్రత్యేక రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జన్మించిన రషీద్ ఖాన్.. జబ్ వి మెట్ అనే బాలీవుడ్ సినిమా అయిన ఆవోగే జబ్ తుమ్ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కళారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే 2006లో ఆయనకు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇక 2022లో పద్మభూషణ్ అవార్డ్ కూడా ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. రషీద్‌ ఖాన్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

Also read: లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టు కట్టే యోచనలో కేంద్రం..

Advertisment
తాజా కథనాలు