మంజుమల్ బాయ్స్ నిర్మాతకు నోటిసులు పంపిన ఇళయరాజా..!

ఇటీవలె విడుదలైన మళయాలం చిత్రం మంజుమల్ బాయ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గుణ సినిమా పాటను అనుమతి లేకుండా వాడుకున్నందుకు మంజుమల్ బాయ్స్ ప్రొడక్షన్ హౌస్‌కి నోటీసు పంపారు.

New Update
మంజుమల్ బాయ్స్ నిర్మాతకు నోటిసులు పంపిన ఇళయరాజా..!

ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్‌లోతెలుగు, తమిళ  అభిమానులను ఎంతగానో అలరించింది. నిజ కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇప్పుడు ఓటీటీలో ను దుమ్మురేపుతోంది. అయితే ఈ సినిమా కు సంబంధించి.. 1990 లో రిలీజైన నాటి చిత్రం గుణలోని కన్మణి అన్బోడు పాటను ఈ చిత్రంలో ప్రదర్శించారు. కాగా అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు మంజుమల్ బాయ్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీకి సంగీత స్వరకర్త ఇళయరాజా తరపున లాయర్ శరవణన్ నోటీసు పంపారు.

కాపీరైట్ చట్టం ప్రకారం పాట  పూర్తి యజమాని పాట  సృష్టికర్త అయినందున, అతను పాటను ఉపయోగించుకోవడానికి లేదా పాటను సినిమా నుండి తొలగించడానికి సరైన హక్కులు పొందాలని వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో తెలిపారు. పాట.లేకుంటే కాపీరైట్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు