Hyderabad: ఎస్‌ఆర్‌ నగర్‌ లో యువకుడి దారుణ హత్య

ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో దారుణ హత్య కలకలం రేపింది.హనుమ హాస్టల్లో వెంకటరమణ అనే ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు ఉంటున్నాడు.అతనితో పాటు ఉండే బార్బర్‌ గణేష్‌ మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. దీంతో కోపం పెంచుకున్న గణేష్‌ కత్తితో దాడి చేసి రమణను హత్య చేశాడు.

New Update
Hyderabad: ఎస్‌ఆర్‌ నగర్‌ లో యువకుడి దారుణ హత్య

SR Nagar Crime: హైదరాబాద్‌ నగరంలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిత్యం ఏదోక మూల హత్య ఉదంతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ హాస్టల్ లో దారుణ హత్య నగరంలో మరోసారి కలకలం రేపింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో వెంకటరమణ ఉంటున్నాడు. వెంకటరమణ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు.

అయితే టీచర్ వెంకటరమణతో పాటు హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్ కూడా అదే రూమ్ లో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు బాగానే ఉండే వారు. అయితే గణేష్ రోజూ మద్యం తాగొచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తుండడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో గణేష్ .. వెంకటరమణపై కోపం పెంచకున్నాడు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు.

ఇక వెంకటరమణ పడుకున్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకటరమణ ఒక్కసారి కుప్పకూలి పోయాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం గురించి పక్క రూమ్‌ లో ఉండే యువకులు హాస్టల్‌ యాజమాన్యానికి తెలియజేశారు. హనుమ హాస్టల్ వారు వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్‌ లైన్స్‌ లోనో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు