Munugodu: మునుగోడు కాంగ్రెస్‎లో ముసలం..చలమల కృష్ణారెడ్డి అలక..!!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో చలమల కృష్ణారెడ్డి అలిగారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల కృష్ణారెడ్డి.. ప్రచార రథాలు కూడా రెడీ చేసుకుని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రకటనతో చలమల గుస్సా అవుతున్నారు. నేడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు.

Munugodu: మునుగోడు కాంగ్రెస్‎లో ముసలం..చలమల కృష్ణారెడ్డి అలక..!!
New Update

నల్లగొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ముసలం రాజుకుంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే రాజగోపాల్ రెడ్డి ఈనెల 27వ తేదీని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో చలమల కృష్ణారెడ్డి అలిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ను చలమల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. గతకొన్నాళ్లుగా ప్రచార రథాలు కూడా రెడీ చేసుకుని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రకటనతో చలమల గుస్సా అవుతున్నారు. నేడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఎట్టిపరిస్థితిలోనూ మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. దీంతో మునుగోడు రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి: ఫోన్ పే, జీ పే వాడే వారికి అలెర్ట్.. ఎన్నికల అధికారుల నిఘా..!!

కాగా పార్టీ వీడతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో .. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నానని ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది ఆయన మునుగోడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రతిష్ఠాత్మకంగా సాగిన మునుగోడు ఉపఎన్నిక పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన బీజేపీని వీడతారని, సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని ప్రచారమైంది. ఆయన ఆయా ప్రకటనలను ఖండిస్తూ వచ్చారు. మునుగోడు టిక్కెట్ కు హామీ లభించటం వల్లనే ఇప్పుడు రాజగోపాలరెడ్డి పార్టీ మారారని పలువురు చెబుతున్నారు. 

బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌..

ప్రజాభిష్టం మేరకే బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ మాత్రమే ఉందని ప్రజలు అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు.కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎల్లుండే చంద్రగ్రహణం.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

#congress #munugodu-politics #rajagopalreddy-vs-chalamala #munugodu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe