రాజగోపాల్ రెడ్డి జెండా వదిలేసి వెళ్లిన నాటి నుంచి తాను రోజుకు 18 గంటలు పని చేసి కాంగ్రెస్ కేడర్ ను కాపాడుకుంటూ వచ్చానని చలమల కృష్ణారెడ్డి (Chalamala Krishnareddy) అన్నారు. ఆయన పెద్దమనస్సు చేసుకుని తనకు మునుగోడు సీటును వదలేయాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి నేతగా ఆయన ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీవీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. తాను మునుగోడులో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని.. ప్రచార వాహనాలను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల సమయంలోనే ఈసారి తనకు టికెట్ ఇస్తామని హైకమాండ్ నుంచి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆ నమ్మకంతోనే ఉన్న ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే తాను ఇక్కడ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాన్ననన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి సిద్ధం.. రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్
టికెట్ విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనకు హామీ ఇచ్చినట్లు కృష్ణారెడ్డి చెప్పారు. ఈ రోజు సాయంత్రం లోగా తనకు శుభవార్త వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు అధిష్టానం అన్యాయం చేయదన్న నమ్మకం ఉందన్నారు. తన దగ్గరకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ రాలేదన్నారు. తాను ఓ కరుడు కట్టిన కాంగ్రెస్ నేతనని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. చలమల కృష్ణారెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.