Munjya : ఓటీటీ కంటే ముందే టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. ఏ ఛానల్ లో టెలికాస్ట్ కానుందంటే..? హారర్ మూవీ 'ముంజ్యా రీసెంట్ గా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రాబోతుంది. ఆగస్ట్ 24న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్ ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. By Anil Kumar 04 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Munjya Movie OTT Release: రీసెంట్ గా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది హారర్ మూవీ 'ముంజ్యా'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రానుందని ప్రకటన వచ్చేసింది. సాధారణంగా సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వస్తాయి. కానీ ముంజ్య సినిమా మాత్రం ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసింది. ఈ మేరకు స్టార్ గోల్డ్ ఛానల్ ఈ సినిమా టెలికాస్ట్ గురించి ప్రకటించింది. Also Read : ప్రభాస్ ‘రాజా సాబ్’ సెట్స్ లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. నెట్టింట ఫొటోలు వైరల్ ఆగస్ట్ 24న రాత్రి ఎనిమిది గంటలకు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేయండని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే 'ముంజ్యా' ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. దీంతో స్టార్ గోల్డ్ ఛానెల్ ముందుగా ప్రకటించి హాట్ స్టార్ కి భారీ షాక్ ఇచ్చింది. #munjya-movie #cinema-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి